✕
Vedhika Kumar : 35 ఏళ్ల వయసులోనూ మెరిసిపోతున్న అందాల భామ
By EhatvPublished on 19 Dec 2023 12:52 AM GMT
ఒకప్పుడు పాతికేళ్లు వచ్చాయంటే చాలు హీరోయిన్లు(Heroine) కనుమరుగయ్యేవారు. అక్క పాత్రనో, వదిన పాత్రనో చేసుకుంటుండేవారు. ఇప్పుడు కాస్త నయం. మూడు పదుల వయసులోనూ హీరోయిన్లుగా మెరుస్తున్నవారు కొందరు ఉన్నారు.

x
Vedhika
-
- ఒకప్పుడు పాతికేళ్లు వచ్చాయంటే చాలు హీరోయిన్లు(Heroine) కనుమరుగయ్యేవారు. అక్క పాత్రనో, వదిన పాత్రనో చేసుకుంటుండేవారు. ఇప్పుడు కాస్త నయం. మూడు పదుల వయసులోనూ హీరోయిన్లుగా మెరుస్తున్నవారు కొందరు ఉన్నారు.
-
- నిజానికి 30 ఏళ్ల వయసు దాటితే కొందరి మొహాల్లోనే వయసు కనిపిస్తుంటుంది. నయనతార(Nayanatara), త్రిష(Trisha) వంటి నటీమణులు ఇందుకు మినహాయింపు. ఇప్పటికీ వారిద్దరిలో గ్రేస్ కనిపిస్తుంది. హీరోయిన్ వేదిక(Vedhika) కూడా అంతే! చెప్పొద్దు కానీ నయనతార, త్రిష కంటే వేదికనే స్లిమ్‌గా, యవ్వనంగా కనిపిస్తారు. వేదిక వయసు 35 ఏళ్లంటే ఎవరూ నమ్మరు.
-
- అంత నాజూగ్గా కనిపించే వేదికకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. తొలుత మోడల్‌గా(Model) ఉన్న వేదిక తర్వాత సినిమా(Cinema) రంగంలో అడుగుపెట్టారు. మదరాసి అనే తమిళ చిత్రంతో ఈమె సినీ కెరీర్ మొదలయ్యింది.
-
- ఆ తర్వాత బాల దర్శకత్వంలో వచ్చిన పరదేశి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కావ్య తలైవన్ సినిమాలో సిద్ధార్థ్ సరసన, ముని, కాంచన-3 సినిమాలలో రాఘవ లారెన్స్‌కు(Raghava Lawrence) జోడిగా నటించారు వేదిక. ఇప్పుడు పలు భాషల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు.
-
- తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా వేదిక రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు తెలుగు(Telugu), రెండు తమిళం, రెండు మలయాళం, ఒక కన్నడ చిత్రాలు ఉండటం విశేషం.
-
- సినిమాల ఎంపికలో వేదిక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నటనకు స్కోప్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

Ehatv
Next Story