వరలక్ష్మి శరత్‌కుమార్ పరిచయం అవసరం లేని నటి. దక్షిణాది చిత్ర పరిశ్రమంలో ఆమె ట్రెండ్ సెట్టర్. సినిమాలకు సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ లైఫ్‌లో ఈమె ఓ ఫైర్‌బ్రాండ్. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్ధలు కొట్టినట్టు చెబుతారు. పోడా పోడి అనే తమిళ సినిమాతో ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇందులో శింబుకు జోడిగా నటించారు. నిజానికి ఈమె శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ పరిచయం అవసరం లేని నటి. దక్షిణాది చిత్ర పరిశ్రమంలో ఆమె ట్రెండ్ సెట్టర్. సినిమాలకు సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ లైఫ్‌లో ఈమె ఓ ఫైర్‌బ్రాండ్. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్ధలు కొట్టినట్టు చెబుతారు. పోడా పోడి అనే తమిళ సినిమాతో ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇందులో శింబుకు జోడిగా నటించారు. నిజానికి ఈమె శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. నటనపై ఆసక్తితో ముంబాయిలోని అనుపమ్‌ఖేర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. అయితే చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లో నటించమని ఆమె తండ్రి శరత్‌కుమార్ షరత్ పెట్టారు. దాంతో బాయ్స్ సినిమా అవకాశాన్ని ఆమె వదులుకున్నారు. ఇదే విధంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సరోజా సినిమాలోనూ వరలక్ష్మి నటించలేకపోయారు. ఇటీవలే ఈ సంగతి చెప్పారు. ఆ తర్వాతే శింబు సరసన పోడా పోడి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని వరలక్ష్మి తెలిపారు. నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా అంతగా ఆడలేదు. కాకపోతే వరలక్ష్మికి మాత్రం మంచి పేరు చ్చింది. ఆ తర్వాత తారై తప్పట్టై సినిమా నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అటు పిమ్మట ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. హీరోయిన్‌గానే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా ఆమె పోషించారు. తెలుగులో కూడా ఆమెకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్‌కుమార్ హాఫ్ సెంచరీ కొట్టేశారు. 50 చిత్రాలు పూర్తయిన సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుకున్నారు. తనకు అండగా నిలిచిన వారికి థాంక్స్ చెప్పారు. తాను ఇంతకాలం నటిగా కొనసాగుతానని గానీ, ఇన్ని చిత్రాల్లో నటిస్తానని అనుకోలేదన్నారు. ఇకపై నటనను ఆపే ప్రసక్తే లేదని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు.