వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi Sarathkumar) డేరింగ్ డాషింగ్ డైనమిక్ లేడి. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పే రకం కాదు. ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా చెబుతారు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమె చాలా డిఫరెంట్. అర్థరాత్రి పోలీసునే చెంపలు పగలగొట్టిన ధైర్యశాలి. ఈ విషయం ఎలా తెలుసంటారా? ఆమె తండ్రి, నటుడు శరత్‌కుమార్ స్వయంగా ఓ వేదికపై ఈ ముచ్చట చెప్పారు. వరలక్ష్మి ఎంపిక చేసుకునే పాత్రలు ఆమె ప్రత్యేకతను సూచిస్తాయి.
వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi Sarathkumar) డేరింగ్ డాషింగ్ డైనమిక్ లేడి. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పే రకం కాదు. ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా చెబుతారు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమె చాలా డిఫరెంట్. అర్థరాత్రి పోలీసునే చెంపలు పగలగొట్టిన ధైర్యశాలి. ఈ విషయం ఎలా తెలుసంటారా? ఆమె తండ్రి, నటుడు శరత్‌కుమార్ స్వయంగా ఓ వేదికపై ఈ ముచ్చట చెప్పారు. వరలక్ష్మి ఎంపిక చేసుకునే పాత్రలు ఆమె ప్రత్యేకతను సూచిస్తాయి. మంచి నటి. ఈ విషయాన్ని దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోడా పోడీ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్ తర్వాత తనకు నచ్చిన పాత్రలు కాకుండా ప్రేక్షకులు మెచ్చే పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన రేంజ్‌ను పెంచుకున్నారు. ఛాలెంజింగ్‌తో కూడిన విలనిజం పాత్రను వరలక్ష్మి తప్ప మరొకరు చేయలేరు. అందుకే అలాంటి పాత్రలకు దర్శకులు వరలక్ష్మినే సంప్రదిస్తారు. ఆ మధ్య సర్కార్ చిత్రంలో అలాంటి పాత్రనే ధరించారు. విజయ్‌కు పోటీగా నటించారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలోనూ అంతే! బాలయ్యతో పోటీపడి మరీ నటించారు. ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్ద కాలం అయ్యింది. సినిమాల సంగతి అటుంచితే కొన్ని కారణాల వల్ల వరలక్ష్మి ఇప్పటి వరకు సైకిల్ నేర్చుకోలేదట. సైకిల్ జోలికే వెళ్లలేదట. ఇప్పుడు మాత్రం ఏకంగా బుల్లెట్‌నే నడిపారు. అది ఆమె ధైర్యం అంటే. సైకిల్ నుంచి స్టెప్ బై స్టెప్ బుల్లెట్ నడపడం వరకు నేర్చేసుకున్నారు. అలా నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వరలక్ష్మి. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల బైక్ నడపడానికి ఇంట్లో అనుమతి దొరకలేదని చెప్పారామె! అయితే బైక్ నడపాలంటే చిన్నపాటి భయం ఉంటుందని, ఆ భయాన్ని పోగొట్టడానికి ఇదే సరైన సమయం అని భావించానని తెలిపారు. అందుకే లాస్ట్ వీక్ బైక్ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తర్వాత స్కూటీ, అటు పిమ్మట బుల్లెట్ కూడా నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు బుల్లెట్‌ను ఈజీగా నడిపేస్తున్నానన్నారు. మొదట్లో కొంచెం కష్టం, బాధ అనిపించినా, భయాన్ని పోగొట్టడానికి ఇదంతా చేశానని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. ఇక్కడ కిందపడ్డాను అన్నది ముఖ్యంగా కాదని, ఎలా మళ్లీ పైకి లేచాను అన్నదే ముఖ్యమని వరలక్ష్మి తెలిపారు.