ఉమైర్ సంధు (Umair Sandhu) అనే ట్విటర్ యూజర్ ట్వీట్ల గురించి అందరికీ తెలిసిందే. ఆ యూజర్ ఇచ్చిన రివ్యూల్లో ఒక్కటి కూడా నిజం కాలేదు. దుబాయ్ సెన్సార్ మెంబర్ అని చెప్పుకునే సంధు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సెన్సార్ మెంబర్ రివ్యూ ఇవ్వడమే చెత్తపని అనుకుంటే.. ఇప్పుటు సెలబ్రిటీల మధ్య ఎఫైర్ అంటూ ట్వీట్లు వేస్తున్నాడు. నోటికి అద్దు అదుపులేకుండా మాట్లాడేస్తున్నాడు. పెద్దపెద్ద సెలబ్రిటీలను ఎవరినీ వదలడం లేదు.

కరణ్, షారుక్, సల్మాన్ ఇలా ఎవరినీ వదల్లేదు సంధు. స్టార్ల మధ్య లింకులు పెడుతున్నారు ఈ యూజర్. తాజాగా ఇలానే అఖిల్ అక్కినేని (Akhil Akkineni), ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) మధ్య ఓ లింగ్ పెట్టాడు. యూరోప్ షూటింగ్ జరిగినప్పుడు ఊర్వశిని అఖిల్ వేధించాడని... మెచ్యురిటీలేని తనంతో ఆమెను వేధించాడని.. అతనితో కలిసి పనిచేయడం అన్ కంఫర్టబుల్గా ఆమెకు అనిపించిందని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వైరల్ అయింది.
దీంతో నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) స్పందించి.. నా లీగల్ టీమ్ నుంచి సదరు యూజర్ పై "పరువు నష్టం దావా కేసును వేస్తున్నాను, నోటీసులు పంపిస్తున్నాను.. మీ లాంటి వాళ్లు వేసే ట్వీట్లతో గౌరవం పోతోంది.. మీరు నా అఫిషియల్ స్పోక్స్ పర్సన్ కాదు.. మైండ్ మెచ్యూరిటీ లేదంటూ.. ఉమైర్ సంధు (Umair Sandhu) మీపై కేసు వేసినట్టు చెప్పింది. ఉర్వశి రౌటేలా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఊర్వశికి ఆమె అభిమానులు సపోర్ట్ చేయడం మొదలెట్టారు. 'వెల్ డన్ ఊర్వశి' అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక ఊర్వశి రౌటేలా రామ్ పోతినేని చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించి వివరాలు తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ కోసం కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే మరి.