నాలుగు పదుల వయసులోనూ త్రిష(trisha) అతిలోక సౌందర్యరాశిలా ఉన్నారు. వర్షం(varsham) సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆమె ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ హోదాను అనుభవిస్తున్నారు. ఇప్పుడా తమిళ సోయగం పట్టిందల్లా బంగారమవుతోంది. వరుస ఫెయిల్యూర్ల నుంచి బయటకు వచ్చేసి వరుస విజయాలను సాధిస్తూ వెళుతున్నారు.

నాలుగు పదుల వయసులోనూ త్రిష(trisha) అతిలోక సౌందర్యరాశిలా ఉన్నారు. వర్షం(varsham) సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆమె ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ హోదాను అనుభవిస్తున్నారు. ఇప్పుడా తమిళ సోయగం పట్టిందల్లా బంగారమవుతోంది. వరుస ఫెయిల్యూర్ల నుంచి బయటకు వచ్చేసి వరుస విజయాలను సాధిస్తూ వెళుతున్నారు. మణిరత్నం తీసిన పొన్నియన్‌ సెల్వన్‌(ponniyin selvan) సినిమా రెండు భాగాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలో త్రిష దేవకన్యలాగే కనిపించారు. పొన్నియన్‌ సెల్వన్‌ తర్వాత త్రిషకు భారీ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పారు. దళపతి విజయ్‌తో(vijay thalapathy) ఓ సినిమా, విశ్వ నాయకుడు కమలహాసన్‌తో(Kamal Hassan) ఓ సినిమా చేయబోతున్నారు. ఇదిలా ఉంటే త్రిష తెలుగులో బంపరాఫర్‌ను కొట్టేశారు. స్టాలిన్‌(stalin) సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో(Chiranjeevi) ఆడిపాడే అవకాశం త్రిషకు దొరికిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌. చిరంజీవి హీరోగా కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నది. ఇందులో త్రిషను హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ సినిమాలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సిద్ధూకు జోడిగా శ్రీలీల నటిస్తున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated On 16 Jun 2023 2:44 AM GMT
Ehatv

Ehatv

Next Story