నాలుగు పదుల వయసులోనూ కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న నటి త్రిష(Trisha Krishnan). ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మంచ రైజింగ్‌లో ఉన్నారు. పాతికేళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్న త్రిష అందం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. పాతికేళ్ల కిందట ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అగ్ర కథానాయికగా కొనసాగడం మరో గొప్ప విషయం. ఇప్పటికీ అవివాహితగా ఉన్న త్రిష అగ్రహీరోలందరి సరసన నటించారు. నటిస్తున్నారు.

Trisha Krishnan
నాలుగు పదుల వయసులోనూ కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న నటి త్రిష(Trisha Krishnan). ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మంచ రైజింగ్‌లో ఉన్నారు. పాతికేళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్న త్రిష అందం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. పాతికేళ్ల కిందట ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అగ్ర కథానాయికగా కొనసాగడం మరో గొప్ప విషయం. ఇప్పటికీ అవివాహితగా ఉన్న త్రిష అగ్రహీరోలందరి సరసన నటించారు. నటిస్తున్నారు. ఇటీవల విజయ్‌తో(Vijay thalapathy) కలిసి లియోలో(Leo) నటించారు. ఆ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి చెన్నైలో లియో సినిమా విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో హీరోయిన్ త్రిష కూడా పాల్గొన్నారు. చిత్ర కథను రెండున్నర గంటలపాటు దర్శకుడు చెప్పిన తీరు తనకు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు త్రిష. లోకేశ్ కనకరాజ్(Lokesh Kanakaraj) అప్పుడు ఏం చెప్పారో దాన్ని తెరపై అలాగే ఆవిష్కరించారన్నారు. ఈ సినిమాలో విజయ్‌తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభవమని చెప్పారు. స్కూల్లో చదువుకున్న వారు కొన్నేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతిని తాను అనుభవిస్తున్నానని తెలిపారు. తన కెరీర్లో తాను ఎక్కువగా పయనించింది విజయ్‌తోనేనని, ఆయన కామ్ గోయింగే ఆయన విజయానికి కారణమని త్రిష అన్నారు. స్నేహితులు, తనను కలిసే వారు మళ్లీ విజయ్‌తో ఎప్పుడు నటిస్తారని పదేపదే అడుగుతుండే వారని త్రిష తెలిపారు. అది ఇన్నాళ్లకు జరిగిందని, లియో చిత్రంలో విజయ్ తాను మళ్లీ జతకట్టామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కూడా తమ జంట వర్క్ అవుటయ్యిందని త్రిష ఆనందపడ్డారు.
