బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)కి కిస్సర్ బాయ్ ఇమేజ్ ఉంది. అతడి సినిమాల్లో ముద్దు సీన్లు కంపల్సరీ. సినిమా ఎలాంటిదైనా సరే కిస్ సీన్ అయితే ఉండి తీరాలి. అప్పుడెప్పుడో అతడు హీరోగా వచ్చిన ఆషిక్ బనాయా ఆప్నే సినిమా సూపర్‌హిట్టయ్యింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన తనుశ్రీదత్తా(Tanushree Dutta)కు అదే ఫస్ట్ మూవీ! ఈ సినిమాలోని ముద్దు సీన్లపై బాలీవుడ్(Bollywood)లో పెద్ద చర్చే జరిగింది.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)కి కిస్సర్ బాయ్ ఇమేజ్ ఉంది. అతడి సినిమాల్లో ముద్దు సీన్లు కంపల్సరీ. సినిమా ఎలాంటిదైనా సరే కిస్ సీన్ అయితే ఉండి తీరాలి. అప్పుడెప్పుడో అతడు హీరోగా వచ్చిన ఆషిక్ బనాయా ఆప్నే సినిమా సూపర్‌హిట్టయ్యింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన తనుశ్రీదత్తా(Tanushree Dutta)కు అదే ఫస్ట్ మూవీ! ఈ సినిమాలోని ముద్దు సీన్లపై బాలీవుడ్(Bollywood)లో పెద్ద చర్చే జరిగింది. ఇమ్రాన్ హష్మీతో కలిసి కిస్ సీన్లలో యాక్ట్ చేయడంపై తనుశ్రీదత్తా ఇన్నాళ్లకు పెదవి విప్పారు. 'ఇమ్రాన్ హష్మీతో నేను దాదాపు మూడు చిత్రాల్లో నటించాను. ఆషిక్ బనాయా ఆప్నే మా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా. అందులో మా ఇద్దరిపై రొమాంటిక్ సీన్స్ చాలా ఉన్నాయి. కిస్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఇమ్రాన్ హష్మీని నేను మొదటి నుంచి ఒక నటుడుగానే చూశాను. అతడితో నాకు ఎలాంటి పరిచయం లేదు. అతడితో ముద్దు సన్నివేశాలు అనగానే కాస్త కంగారు పుట్టింది. కాకపోతే చిత్ర యూనిట్ అందరూ సపోర్ట్ ఇవ్వడంతో నటించగలిగాను. చాక్లెట్ అన్న సినిమాతో ఇద్దరిపై ముద్దు సీన్స్ చిత్రీకరించారు. అయితే ఎడిటింగ్‌లో ఆ సీన్లను తీసేశారు. అప్పట్లో ఇమ్రాన్‌కు బాలీవుడ్‌లో కిస్సర్ బాయ్ ఇమేజ్ ఉండేది. నాకు తెలిసినంత వరకూ ఆయన అలాంటి వ్యక్తి కాదు. ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి ఆయన కూడా ఎంతో ఇబ్బందిపడతాడు' అని తనుశ్రీదత్తా చెప్పుకొచ్చారు. అని ఆమె చెప్పారు. 2003లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెల్చుకున్న తనుశ్రీ తర్వాత విశ్వసుందరి పోటీల్లోనూ పాల్గొన్నారు. 2005లో ఆషిక్ బనాయా ఆప్నే సినిమా తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారామె. వీరభద్ర అనే తెలుగు చిత్రంలోనూ ఆమె నటించారు.