దివ్యభారతి(Divya Bharati).. తొమ్మిదో దశకంలో వెండితెరపై వెలుగులు జిమ్మిన నటి. యువతరం డ్రీమ్‌ గర్ల్‌ ఆమె! కేవలం దివ్యభారతి కోసమే కొన్ని సినిమాలు విజయవంతమయ్యాయి. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎనలేని పేరుప్రఖ్యాతులను సంపాదించింది. తెలుగులో బొబ్బిలిరాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రం తదితర సినిమాల్లో నటించింది దివ్య భారతి. గ్రీకు దేవత వీనస్‌లాగే ఉండే దివ్యభారతి తన అందంతో యువతను వెర్రెక్కించింది.

దివ్యభారతి(Divya Bharati).. తొమ్మిదో దశకంలో వెండితెరపై వెలుగులు జిమ్మిన నటి. యువతరం డ్రీమ్‌ గర్ల్‌ ఆమె! కేవలం దివ్యభారతి కోసమే కొన్ని సినిమాలు విజయవంతమయ్యాయి. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎనలేని పేరుప్రఖ్యాతులను సంపాదించింది. తెలుగులో బొబ్బిలిరాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రం తదితర సినిమాల్లో నటించింది దివ్య భారతి. గ్రీకు దేవత వీనస్‌లాగే ఉండే దివ్యభారతి తన అందంతో యువతను వెర్రెక్కించింది. అటుపై బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ దవానా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. తక్కువకాలంలోనే సూపర్‌స్టార్‌ స్థాయికి చేరుకుంది. . ఊహించని విధంగా ప్రమాదవశాత్తు కన్నుమూసింది. ముంబయిలోని ఓ బహుళ అంతస్తుల భవనం మీదనుంచి కిందపడి తుదిశ్వాస విడిచింది దివ్యభారతి. ఆమె మరణంపై నేటికీ అనుమానాలున్నాయి. ఆమెది ఆత్మహత్యో, హత్యో తెలియదు. ఇప్పటికీ అదో మిస్టరీ. త్వరలో దివ్యభారతి బయోపిక్‌(Biopic) వెండితెరపై అలరించబోతున్నది. ఈ సినిమాలో దివ్యభారతి పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) పోషిస్తున్నారట! ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్‌ను నిర్మించనుంది. పాలమీగడలాంటి సొగసున్న దివ్యభారతి పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించడం చెప్పుకోదగ్గ అంశం!

Updated On 9 Sep 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story