దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటించడం అంటే మాటలు కాదు.. చాలా తక్కువ మందికే ఆ అవకాశం లభిస్తుంది. తమన్నా భాటియా(Tamannaah bhatia) 18 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ వస్తున్నారు. అది కూడా ఆరంభంలో ఎంత గ్లామర్‌గా ఉన్నారో, ఇప్పుడూ అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ వయసులోనూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్నారు. సినిమా ఆఫర్లు ఆమెకు వరుసగా వస్తున్నాయి. అదీ కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా నటించడం అంటే మాటలు కాదు.. చాలా తక్కువ మందికే ఆ అవకాశం లభిస్తుంది. తమన్నా భాటియా(Tamannaah bhatia) 18 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ వస్తున్నారు. అది కూడా ఆరంభంలో ఎంత గ్లామర్‌గా ఉన్నారో, ఇప్పుడూ అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ వయసులోనూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్నారు. సినిమా ఆఫర్లు ఆమెకు వరుసగా వస్తున్నాయి. అదీ కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు. ఒకే సారి ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన(Chiranjeevi), సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. దానికి ఆమె చాలా హాప్పీగా ఉన్నారు. ' ఓ నటిగా నా కల నిజమైనట్లుంది. రజనీకాంత్, చిరంజీవి వంటి ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి ఓకేసారి అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుండటం గొప్ప అనుభూతిని కలిగిస్తోంది' అని తమన్నా చెప్పుకొచ్చారు. ఆమె ప్రస్తుతం రజనీకాంత్‌తో జైలర్(Jailer) సినిమాలో చిరంజీవితో భోళా శంకర్(Bhola Shankar) చిత్రంలో నటించారు.
మరో విశేషమేమింటే ఈ రెండు సినిమాలు ఈ నెల 10, 11 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రావడం. 'సైరాలో నాకు చిరంజీవితో కలిసి నటించే అవకాశం లభించింది. కానీ డ్యాన్స్ చేయలేకపోయాను. ఇప్పుడు అది భోళాశంకర్‌తో తీరింది. జైలర్ విషయానికి వస్తే అందులో నా పాత్ర చిన్నదే. కానీ భారీ తారాగణముంది. నా 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇటు అగ్రహీరోలతోనూ, అటు యువ హీరోలతోనూ అందరితో కలిసి పని చేశాను. అయితే నేను ఎవరితో కలిసి పని చేసినా వారి వయసును ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోను. అందరిని నటులుగానే చూస్తాను. మేము చేసే పాత్రలు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయా? లేదా? అన్నదే ఆలోచిస్తాను' అని తమన్నా అన్నారు. పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ 'నేను ఏదైనా ముక్కు సూటిగానే మాట్లాడతాను. ప్రేమ విషయాన్ని నాకు నేనుగానే బయటపెట్టాను. అలాగే పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా నేనే స్వయంగా వెల్లడిస్తాను. ఇప్పటికైతే అలాంటి ప్రణాళికలు లేవు' అని తమన్నా భాటియా అన్నారు.