హీరోయిన్ తమన్నా(Tamanna)ను మిల్కీ బ్యూటీ అని ఎందుకన్నారో కానీ నిజంగానే ఆమెది పాలమీగడ సొగసు. సినిమాల్లో అడుగు పెట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అదే గ్రేస్, అదే ఎనర్జీ. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్-2 (Lust Stories 2)లో అందాలను ఆరబోశారు తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మ(vijaywarma)తో ప్రేమలో పడిన తమన్నా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పారు.

Tamannaah Bhatia
హీరోయిన్ తమన్నా(Tamanna)ను మిల్కీ బ్యూటీ అని ఎందుకన్నారో కానీ నిజంగానే ఆమెది పాలమీగడ సొగసు. సినిమాల్లో అడుగు పెట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అదే గ్రేస్, అదే ఎనర్జీ. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్-2 (Lust Stories 2)లో అందాలను ఆరబోశారు తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మ(vijaywarma)తో ప్రేమలో పడిన తమన్నా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. దాంతో ఒక్కసారిగా తమన్నాపై అందరి దృష్టి పడింది. విజయ్‌వర్మ విషయంలో తమన్నా తొందరపడ్డారని కొందరు, జోడి చక్కగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు తమన్నా ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చుట్టుముడుతున్నారు. రీసెంట్‌గా ముంబాయి ఎయిర్‌పోర్ట్(mumbai Airport)లో ఓ ఫ్యాన్‌తో తమన్నా చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. తమన్నా చూపుతున్న ఆదరణతో అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. తమన్నాను కలిసిన తర్వాత అతడు ఆమె పాదాలను తాకాడు. ఆపై ఒక బోకేతో పాటు ఓ లెటర్‌ను కూడా తమన్నాకు ఇచ్చాడు. తన చేతిపై పచ్చబొట్టును కూడా తమన్నాకు చూపించాడు. అది చూసి తమన్నా కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ పచ్చబొట్టులో లవ్ యు ది తమన్నా అని రాసి ఉంది. దాంతో పాటు తమన్నా ఫోటోను కూడా టాటూగా వేయించుకున్నాడా ఫ్యాన్. తర్వాత ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకుని పలు మార్లు థాంక్స్ చెబుతూ కారు ఎక్కారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఆమెపై ఆరాధన రెట్టింపయ్యిందని అంటున్నారు తమన్నా ఫ్యాన్స్. అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ఈ వీడియో చెబుతున్నదని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. ఆమె బంగారంలాంటి మనిషని, ఒకరు, అభిమానులకు చాలా గౌరవమిస్తారని మరొకరు కామెంట్ చేశారు. మొత్తం మీద తమన్నాపై అభినందనలతో కూడిన కామెంట్ల వర్షం కురుస్తోంది.
