సినీ నటి శ్వేతవర్మ(Shweta Varma) బిగ్‌బాస్ రియాల్టీ షోతో(Bigg Boss reality Showu) చాలా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రాని పేరు ప్రఖ్యాతులు బిగ్‌బాస్ షో ద్వారా వచ్చాయి. బిగ్‌బాస్ సీజన్ ఫైవ్‌లో శ్వేతవర్మ పాల్గొన్న తర్వాత టెలివిజన్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా అభిమానులకు కూడా ఆమె దగ్గరయ్యారు. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి.
సినీ నటి శ్వేతవర్మ(Shweta Varma) బిగ్‌బాస్ రియాల్టీ షోతో(Bigg Boss reality Showu) చాలా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రాని పేరు ప్రఖ్యాతులు బిగ్‌బాస్ షో ద్వారా వచ్చాయి. బిగ్‌బాస్ సీజన్ ఫైవ్‌లో శ్వేతవర్మ పాల్గొన్న తర్వాత టెలివిజన్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా అభిమానులకు కూడా ఆమె దగ్గరయ్యారు. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా కూడా నటించారు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని ఛాన్సులు వచ్చినా పాత్రలు నచ్చక వదిలేసి ఉంటారు. అందుకే కొంత కాలంగా శ్వేత వర్మ సినిమాలలో కనిపించడం లేదు. సినిమాలకు దూరమైనప్పటకీ సోషల్ మీడియా(Social media) ద్వారా మాత్రం అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై నీచమైన కామెంట్లు చేశాడు. అతడు పంపిన మెసేజ్‌లతో పాటు అతగాడి ప్రొఫైల్‌ను(Profile) స్క్రీన్ షాట్స్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్ చేశారు. ' ఓ మనిషికి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతడి అమ్మకు ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇలాంటి వాళ్లు ఇప్పటికీ ఇంకా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను' అని శ్వేతరాసుకొచ్చారు. అతడి అడ్రస్,కాంటాక్ట్ నంబర్ కూడా సంపాదించానని, ఆ విరాలు కూడా ఇన్‌స్టాలో పెట్టవచ్చు కానీ నేను మనిషిని కాబట్టి ఆ పని చేయలేకపోతున్నానని శ్వేతవర్మ తెలిపారు. ఇది అతడికో గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పాడుపనులు చేయకుండా ఉంటే మంచిదని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు శ్వేత వర్మ. ఈ వీడియోపై నెటిజన్ల స్పందన బాగుంది. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.