మా టీవీలో వచ్చిన కలర్స్ ప్రోగ్రామ్ అప్పట్లో పెద్ద హిట్. ఆ ప్రొగ్రామ్‌తోనే స్వాతి(swathi) తెలుగువారికి దగ్గరయ్యింది. కలర్స్ స్వాతిగా(Colors swathi) పేరు సంపాదించుకుంది. అటు పిమ్మట సినిమాల్లోనూ అడుగుపెట్టింది. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలో నటించింది. త్వరలోనే

Actress Swathi
మా టీవీలో వచ్చిన కలర్స్ ప్రోగ్రామ్ అప్పట్లో పెద్ద హిట్. ఆ ప్రొగ్రామ్‌తోనే స్వాతి(swathi) తెలుగువారికి దగ్గరయ్యింది. కలర్స్ స్వాతిగా(Colors swathi) పేరు సంపాదించుకుంది. అటు పిమ్మట సినిమాల్లోనూ అడుగుపెట్టింది. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలో నటించింది. త్వరలోనే మంత్ ఆఫ్ మధు తో మన ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా తన కెరీర్ తొలినాళ్లను స్వాతి గుర్తు చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(Adavari matalaku ardhale verule) సినిమాలో వెంకటేష్‌కు(Venkatesh) మరదలిగా నటించానని, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఎక్కువగా మరదలి పాత్రలే వచ్చాయని తెలిపింది.
సైడ్ క్యారెక్టర్లు చేయడం ఎందుకని వాటిని తిరస్కరించానని చెప్పారు. గ్రాఫ్ కొంచెం డల్‌గా అవుతుంది అనుకునే సమయానికి మంచి హిట్ వచ్చేదని, కార్తికేయ(Karthikeya), స్వామిరారా(swamy ra ra) వంటి సినిమాల్లో నటించినందుకు చాలా ఆనందంగా ఉందని స్వాతి అన్నారు. డేంజర్(danger) సినిమాలో నటించినప్పుడు తనపై చాలా వదంతులు వచ్చాయని, కానీ వాటిని తాను అసలు పట్టించుకోలేదని చెప్పారు . అవి వదంతులు అని తెలిసినప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. హీరో నాని సరసన నటించిన అష్టా చమ్మాలో చక్కగా నటించి నంది అవార్డును సొంతం చేసుకుంది స్వాతి.
