✕
Sunny Leone : నటి సన్నీ లియోన్ కథ వింటే కన్నీళ్లు రాక మానవు.. !
By EhatvPublished on 21 March 2023 4:40 AM GMT
సన్నీలియోన్ (Sunny Leone) అంటే కుర్రకారుకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె భారత సంతతికి చెందింది. సన్నీ లియోన్ (Sunny Leone) పోర్న్ (Porn Videos) వీడియోలు చేస్తూ చీకటి ప్రియులకు బాగా పరిచయమైంది. ఈమె తండ్రి టిబెట్‌లో పుట్టి సిక్కుమతస్తుడైన ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఆమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13న పుట్టిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. అయితే ఈమె పుట్టకముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు.

x
Sunny Leone
-
- సన్నీలియోన్ (Sunny Leone) అంటే కుర్రకారుకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె భారత సంతతికి చెందింది. సన్నీ లియోన్ (Sunny Leone) పోర్న్ (Porn Videos) వీడియోలు చేస్తూ చీకటి ప్రియులకు బాగా పరిచయమైంది. ఈమె తండ్రి టిబెట్‌లో పుట్టి సిక్కుమతస్తుడైన ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఆమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13న పుట్టిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. అయితే ఈమె పుట్టకముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు.
-
- అయితే సన్నీ లియోన్ (Sunny Leone) చిన్నతనంలోనే పాటలు పాడటం, డాన్స్ చేయడంతోపాటు హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్టపడేది. చిన్నతనం నుంచే సన్నీ లియోన్ (Sunny Leone) స్వేచ్ఛగా పెరిగింది. సన్నీ తన 11వ యేటలోనే తన బాయ్ ఫ్రెండ్‌తో తొలిముద్దును రుచి చూసిందట. ఆ తర్వాత కాలిఫోర్నియా వెళ్లిపోయిన ఆమె.. మోడల్‌గా ఎదగాలని ఆశ పడిందట. 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా ట్రైనింగ్ తీసుకుంది సన్నీ లియోన్.
-
- ఆ టైమ్‌లోనే బట్టలు విప్పుతూ డాన్స్ చేసే మరో యువతి ఆమెకు పరిచయం అయింది. ఈమె ద్వారా స్టీవెన్ జాన్ అనే ఏజెంట్ పరిచయం అయ్యాడట. ఆ ఏజెంట్‌తో మేల్ పేపర్ అయిన పెంట్‌హౌస్‌లో పని చేసే ‘జె అలెన్’ను కలిసిన తర్వాత పోర్న్ ఇండస్ట్రీపై ఈమెకు అపోహలు తొలగిపోయాయట. ఇక ఆతర్వాత సన్నీ ‘చెరి’, ‘హై సొసైటీ’, ‘స్వాంక్’, ‘లెగ్ వరల్డ్’, ‘హస్లర్’, క్లబ్ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పేపర్లకు న్యూడ్ ఫోటోషూట్ చేసింది ఆమె.
-
- 2003లో ‘పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్’( Penthouse Pet of the Year) అవార్డును ఆమె గెలుచుకుంది. 2005లో పోర్న్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె ఏవీఎన్ (AVN Award) అడల్డ్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది సన్నీ లియోన్. ఇక సన్నీ పోర్న్ వీడియోలు చేస్తుండటంతో కుటుబంలో చాలా సమస్యలు వచ్చాయట. చాలా కుటుంబాల్లో జరిగినట్టే తమ కుటుంబంలో కూడా కోపం, ప్రేమ, ద్వేషం లాంటివి ఉండేవని సన్నీ తెలిపింది. చెడు మార్గంలోకి వెళ్లకుండా తనను, తన బ్రదర్‌ని తండ్రి కాపాడారని చెప్పుకొచ్చింది.
-
- అయితే 21ఏళ్లు వచ్చే సరికి జనాలు ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారని.. అది చాలా దారుణంగా ప్రభావం చూపిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తాను ఒక్కోసారి ఏడ్చేసేదాని అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయన్నది సన్నీ లియోన్ (Sunny Leone).
-
- డేనియల్ వెబర్ (Daniel Weber)తో ఏడడుగులు వేసిన క్షణాలు గురించి కూడా ఆమె యానివర్సరీ రోజునాడు అభిమానులతో చెప్పుకుంది. ఆ సమయంలో తను దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్టు వివరించింది హాట్ సుందరి సన్నీ. పెళ్లి సమయంలో గెస్ట్ లు ఇచ్చిన గిఫ్ట్‌లతో పెళ్లికి అయిన ఖర్చులను చెల్లించినట్టు చెప్పుకొచ్చింది. తన పెళ్లిలో ఏదీ సరిగా జరగలేదని చెప్పుకొచ్చింది.
-
- మేం ఇద్దరం కలిసి అన్ని అడ్డంకులు దాటి ఇప్పుడీ స్థితికి చేరామని, దానికి కారణం తమ మధ్య ఉన్న ప్రేమే అని సన్నీ లియోన్ (Sunny Leone) చెప్పింది. ఇక సన్నీ గతంలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’లో మెరిసింది. ఈ షో ద్వారానే బాలీవుడ్ లోకి శృంగార సుందరి సన్నీ లియోన్ అడుగుపెట్టింది. వచ్చిన ఛాన్సులను మంచిగా ఉపయోగించుకుంటూ.. పోర్న్ స్టార్‌గా ఉన్న ఇమేజ్ నుంచి బయటపడుతూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.
-
- ఇక ఐదేళ్ల క్రితం ‘కరణ్ జిత్ కౌర్-ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ’ పేరుతో (Karenjit Kaur – The Untold Story of Sunny Leone) సన్నీ బయోపిక్‌ను చిత్రీకరించారు. ఈ బయోపిక్‌ను ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
-
- మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ చిత్రంలో సన్నీ లియోన్ నటించింది. ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీలోకి కూడా ఆమె అడుగుపెట్టింది. ఆ తర్వాత జిన్నా సినిమాలోనూ సన్ని నటించింది. రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సన్నీ లియోన్. ఇక ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో 54 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story