హీరోయిన్ గా తన జీవితం అంత గొప్పగా సాగలేదంటుంది సౌత్ స్టార్ నటి సుహాసిని(Suhasini). తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు అనుభవించాను అంటుంది సీనియర్ నటి. అంతే కాదు చాలా ఇబ్బందులు కూడా కెరీర్ లో పడ్డానంటోంది సుహాసిని. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటీ..?

సుహాసినికి అప్పట్లో హోమ్లీ హీరోయిన్ అని పేరు ఉంది. హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాలు చేసింది కాని.. ఏనాడు హద్దులు దాటలేదు. హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. వస్త్రధారణ విషయంలో కూడా ఆమె ఏనాడూ హద్దులు దాటలేదు. అయితే హీరోయిన్ గా చేసేటప్పుడు తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తను హీరోయిన్ గా నటించినా.. తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకున్నాను అన్నారు సుహాసిని. ఒక వేళ అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తాను తిరస్కరించేదాన్నని చెప్పారు. అవసరం అయితే ఆ సినిమా వదలుకునేదాన్ని కాని.. ఏనాడు అలాంటివి చేయలేదు అంటోంది సుహాసిని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందని... అయితే పరాయి వ్యక్తి ఒడిలో కూర్చునే సీన్ కాబట్టి ఆ సీన్ ను తాను చేయనని చెప్పానని తెలిపారు.
అంతే కాదు అదే సినిమాలో హీరోతో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ ఉందని... హీరో తిన్న ఐస్ క్రీమ్(Ice Cream) నే తినాలని తనకు చెప్పారని... వేరే వాళ్లు తిన్న ఐస్ క్రీమ్ ను తాను తినడం ఏమిటని సీరియస్ అయ్యానని చెప్పారు. అయితే తాను చెప్పిన విధంగా చేయాలని కొరియోగ్రాఫర్ తనపై సీరియస్ అయ్యాడని... అయినా తాను అంగీకరించలేదని... ఎంగిలి ఐస్ క్రీమ్ తినడం కాదు, కనీసం ముట్టుకోనని చెప్పానని... దీంతో ఐస్ క్రీమ్ మార్చారని తెలిపారు.