అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్‌(Sukumar) కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2(Pushpa-2) సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు

అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్‌(Sukumar) కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2(Pushpa-2) సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప ద రైజ్‌ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లను కుమ్మి పారేసింది. దేశమంతా పుష్ప గురించే చెప్పుకున్నారు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును(National award) కూడా తెచ్చి పెట్టింది. రెండో పార్ట్‌ పుష్ప ద రూల్‌ డిసెంబర్‌ 5 వ తేదిన విడుదల కానున్నది. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో(Special song) అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల(sreeleela) స్టెప్పులు వేయనున్నది. పుష్ప 1 లో సమంత(Samantha) పాట ఎంత సంచలనం సృష్టించిందో ఈ పాట కూడా అంతే హిట్టు అవుతుందని అనుకుంటున్నారు.ఇప్పటికే ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీల రెండు కోట్ల రూపాయలు తీసుకున్నదట.

అయితే గుంటూరు కారం(gutur kaaram) మూవీ రెమ్యునరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువ. మహేశ్‌ బాబుతో కలిసి నటించిన మూవీకి 4 కోట్ల రూపాయలు తీసుకుంది శ్రీ లీల. పుష్ప ద రైజ్‌లో సమంత రెమ్యునరేషన్‌తో పోలిస్తే శ్రీలీలకు ఇచ్చింది 60శాతం తక్కువ. పుష్ప-1లో సమంత ఊ అంటావా అనే ఐటమ్‌ సాంగ్‌ కోసం సమంత 5కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. సమంత తో శ్రీ లీలను పోల్చకూడదు. అయితే, పుష్ప-2లో ఐటమ్‌ సాంగ్‌ కోసం మొదట బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను(Shradha kapoor) అడిగారు. ఆమె 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ అడిగిందట. దాంతో మేకర్స్ శ్రీలీలను సంప్రదించారు.

Eha Tv

Eha Tv

Next Story