పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల(sreeleela). మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా శ్రీలీలకు మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. అందం, అభినయం రెండూ ఉండటంతో ఈ అందాల భామకు వరుస ఆఫర్లు వచ్చాయి. పెళ్లి సందD సినిమా తర్వాత వచ్చిన ధమాకా సినిమా శ్రీలీల సినీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ఈమె మహేశ్‌బాబు(Mahesh babu) వంటి స్టార్‌ హీరోల సరసన నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఏ స్టార్‌ హీరోయిన్‌కు లేనన్ని సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి.

పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రీలీల(sreeleela). మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా శ్రీలీలకు మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. అందం, అభినయం రెండూ ఉండటంతో ఈ అందాల భామకు వరుస ఆఫర్లు వచ్చాయి. పెళ్లి సందD సినిమా తర్వాత వచ్చిన ధమాకా సినిమా శ్రీలీల సినీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ఈమె మహేశ్‌బాబు(Mahesh babu) వంటి స్టార్‌ హీరోల సరసన నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఏ స్టార్‌ హీరోయిన్‌కు లేనన్ని సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. దాదాపు పది సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. దీన్ని బట్టి శ్రీలీల క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ శ్రీలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చి ఆమె కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ శ్రీలీల మాత్రం తన కెరీర్‌ విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా నచ్చిన, పేరొచ్చే ప్రాజెక్టులకే ఓకే చెబుతోంది.

తనకు నచ్చకపోతే మాత్రం ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా నిర్మోహమాటంగా కాదని అంటోందట! తాజాగా శ్రీలీల ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(allu Arjun) సినిమానే రిజెక్ట్‌ చేసిందట. అది కూడా పాన్‌ ఇండియా మూవీ పుష్ప-2(Pushpa-2). అల్లు అర్జున్‌, సుకుమార్‌(sukumar) కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ అదరగొట్టేసింది. ఈ సినిమా పాటలు దేశమంతటా మారుమోగాయి. సెలెబ్రిటీలు ఈ సినిమా పాటలకు స్టెప్పులేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసుకున్నారు. అందులో ఐటమ్‌ సాంగ్‌ ఊ అంటావా మావా..’చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సమంత వల్లే ఆ ఐటమ్‌ సాంగ్‌కి అంత పేరు వచ్చిందన్నది కాదనలేని సత్యం. అందుకే పుష్ప -2లో కూడా అలాంటి ఓ ఐటమ్‌ సాంగ్‌ని పెడితే బాగుంటుందని సుకుమార్‌ అనుకున్నాడు.

ఇందుకసం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్స్‌ను పరిశీలించాడు. మొదట ఒకరిద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లతో ఈ ఐటమ్‌ సాంగ్‌ను తీయాలనుకున్నాడు సుకుమార్‌. కానీ చాలా మంది శ్రీలీల అయితే బాగుంటుందని సుకుమార్‌కు సలహా ఇవ్వడంతో ఆయన శ్రీలీలను సంప్రదించాడట! సుకుమార్‌ ఆఫర్‌ను శ్రీలీల సున్నితంగా తిరస్కరించారట. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఐటమ్‌సాంగ్‌ చేస్తే ఈన కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని అనుకుని ఆఫర్‌ను కాదనేసిందట! భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను ఆఫర్‌ చేసినప్పటికీ నో చెప్పేసిందట! ఇప్పటికే మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ లాంటి స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తున్న శ్రీలీలకు భవిష్యత్తులో అల్లు అర్జున్‌ సరసన నటించే అవకాశం వస్తే మాత్రం కాదనబోదట. ఇప్పటికే ఓ యాడ్‌లో శ్రీలీల, బన్నీ కలిసి నటించారు. వీరిద్దరు జంటగా నటించే సినిమా వస్తే బాగుండని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Updated On 28 July 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story