పెళ్లిసందD(Pellisandadi) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు(Sreeleela) మొదటి సినిమానే ఫ్లాప్ కావడం నిరాశ కలిగించింది. కాకపోతే శ్రీలీలకు ఆ సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలు దూరంగా ఉన్నారు. తర్వాత ఆమెకు ధమాకాలో(Dhamaka) ఆఫర్ వచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్టయ్యింది. సినిమా సక్సెస్‌లో శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ప్రధాన కారణం అయ్యింది. దాంతో శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యింది.
పెళ్లిసందD(Pellisandadi) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు(Sreeleela) మొదటి సినిమానే ఫ్లాప్ కావడం నిరాశ కలిగించింది. కాకపోతే శ్రీలీలకు ఆ సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలు దూరంగా ఉన్నారు. తర్వాత ఆమెకు ధమాకాలో(Dhamaka) ఆఫర్ వచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్టయ్యింది. సినిమా సక్సెస్‌లో శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ప్రధాన కారణం అయ్యింది. దాంతో శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. నాలుగైదు నెలల కిందటి వరకు టాలీవుడ్‌లో ఆమె గురించే చర్చ జరిగింది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చేసింది. అందరూ ఆమె డాన్స్ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడామె కనిపించడం లేదు. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. ఆమె పోతినేని రామ్‌తో(Ram pothineni) నటించిన స్కంధ, వైష్ణవ్ తేజ్‌తో(Vaishnav Tej) నటించిన ఆదికేశవ, నితిన్‌తో(Nithin) చేసిన ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ ఇవన్నీ నెలల వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి అన్ని డిజాస్టర్లే! బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడిగా వచ్చిన భగవంత్ కేసరి మాత్రం హిట్టయ్యింది. మొన్న సంకాంత్రి పండుగకు వచ్చిన గుంటూరు కారం పెద్దగా ఆడలేదు. ఇప్పడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో(Ustad Bhagath Singh) పాటు మరో సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఆమె ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఇప్పుడామెకు బోల్డంత సమయం దొరుకుతోంది. ఆ సమయాన్ని చదువుపై ఫోకస్ పెట్టడానికి ఉపయోగించుకుంటోంది. మంచి పాత్రలు వస్తేనే ఒప్పుకుందాం అన్న ఆలోచనలో ఉంది.