నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) నటిస్తున్న తాజా సినిమా భగవంత్‌ కేసరి(Bhagavanth kesari). ఇందులోని ఓ పాట ఈ మధ్యనే విడుదలయ్యింది. ఆ పాటలో బాబాయ్‌, కూతుళ్లుగా బాలకృష్ణ, శ్రీలీల చేసిన హంగామా మామూలుగా లేదు. ఫ్యాన్స్‌ కూడా ఆ పాటలో బాలయ్య లుక్‌కు, శ్రీలీల జోష్‌కు ఫిదా అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల భగవంత్‌ కేసరి సినిమా విశేషాలను, బాలకృష్ణతో తన అనుభవాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి ఫిదా అయ్యానని శ్రీలీల అన్నారు.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) నటిస్తున్న తాజా సినిమా భగవంత్‌ కేసరి(Bhagavanth kesari). ఇందులోని ఓ పాట ఈ మధ్యనే విడుదలయ్యింది. ఆ పాటలో బాబాయ్‌, కూతుళ్లుగా బాలకృష్ణ, శ్రీలీల చేసిన హంగామా మామూలుగా లేదు. ఫ్యాన్స్‌ కూడా ఆ పాటలో బాలయ్య లుక్‌కు, శ్రీలీల జోష్‌కు ఫిదా అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల భగవంత్‌ కేసరి సినిమా విశేషాలను, బాలకృష్ణతో తన అనుభవాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి ఫిదా అయ్యానని శ్రీలీల అన్నారు. బాలకృష్ణ సార్‌ బయట వేరు, కెమెరా ముందుకు వస్తే వేరు. ఒక్కసారి పాత్రలోకి ఎంటరయ్యారంటే ఆయన పాత్రలోకి ఒదిగిపోతారు. భగవంత్‌ కేసరిలో నటిస్తున్నప్పుడు తనకు బాలకృష్ణ కనిపించలేదని, భగవంత్ కేసరినే కనిపించాడని శ్రీలీల అన్నారు. అంతగా పాత్రలో లీనమవుతారాయన. ఇందులో మా పాత్రల గురించి రివీల్‌ చేయడం తనకు ఇష్టం లేదని, ఈ సినిమా చేస్తున్నంత సేపూ ఆయన నాకు సొంత బాబాయ్‌లాగే అనిపించారని చెప్పారు. ఆయన కూడా లోకేషన్‌లలో అలాగే చూసుకున్నారని తెలిపారు. మరో అవకాశం వస్తే మళ్లీ బాలకృష్ణ సార్‌తో నటించాలని ఉందని చెప్పారు శ్రీలీల.

Updated On 4 Sep 2023 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story