శ్రీలీల ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఏ డైరెక్టర్ ను, హీరోను కదిలించినా శ్రీలీల పేరు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పెద్ద హీరోలను నుంచి చిన్న హీరోల వరకు ఆమెనే కావాలని చూస్తున్నారు. ఇటు నిర్మాతలు కూడా శ్రీలీలను ప్రాజెక్టులో పెట్టుకుంటే బిజినెస్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

శ్రీలీల ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఏ డైరెక్టర్ ను, హీరోను కదిలించినా శ్రీలీల పేరు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పెద్ద హీరోలను నుంచి చిన్న హీరోల వరకు ఆమెనే కావాలని చూస్తున్నారు. ఇటు నిర్మాతలు కూడా శ్రీలీలను ప్రాజెక్టులో పెట్టుకుంటే బిజినెస్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

ఈ బ్యూటీని మొదట ఎ.పి అర్జున్ దర్శకత్వం వహించిన కన్నడ మూవీ ‘కిస్’ తో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇదే సినిమాను తెలుగులో ‘ఐ లవ్ యూ ఇడియట్’ పేరుతో డబ్ చేశారు. ఇక పెళ్లి సందD సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ సినిమాలో తన డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమాలో రోషన్ లాభపడ్డాడో లేదో తెలియదు కానీ ఒక్క సినిమాతో కన్నడ భామ లైఫ్ మాత్రం మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల తెలుగు ప్రేక్షకులను తన నవ్వుతో పడేసిందనే చెప్పాలి. శ్రీలీలకు చిన్నప్పటి నుంచే డాన్స్ అలవాటు ఉండటంతో తన ప్రతీ సినిమాలో తన స్టెప్పులతో ఆకట్టుకుంటుంది.

ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హీరోయిన్లు కీర్తి సురేష్, పూజా హెగ్డె, కృతిశెట్టి, రష్మిక ఇలా వీళ్లంతా తెలుగులో ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వాళ్ల ఆఫర్స్ ను శ్రీలీల కొట్టేస్తుందనే చెప్పాలి. ఒకప్పుడు సమంత ఫుల్ బిజి, ఆ తర్వాత కృతిశెట్టి బిజీ.. ఇప్పుడు శ్రీలీల బిజీగా ఉంది. ఏది ఏమైనా శ్రీలీల బిజి అయినట్టు వీళ్లేవరూ బిజీ అవ్వలేదు.

ఇదీలా ఉంటే రష్మికకు పుష్ప ప్రాజెక్ట్, అలాగే పూజా హెగ్డెకు మహేష్ మూవీ, సమంతకు ఖుషితోపాటు ఓ వెబ్ సిరీస్ ఉంది. వీళ్లందరికీ ఒకట్రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.. కానీ శ్రీలీలకు మాత్రం ఆరేడు ప్రాజెక్టులు ఉన్నాయట. ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీలీల ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఆ తర్వాత నుంచి వచ్చే ప్రాజెక్టులన్నీ ఆమె చేతిలోకే వెళ్తున్నాయి. ఇక మహేష్ బాబు సినిమాలో శ్రీలీలను తీసుకోవడంపై ఆ మధ్య పూజా హెగ్డె కాస్త అలిగిందట.

అయితే కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేస్తూ.. మరొకొన్ని చిత్రాల్లో కూతురి పాత్రలను కూడా చేస్తోంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఇక ఈమె బాలయ్య బాబు, రామ్, నితిన్, నవీన్ పొలిశెట్టి సహా మరో ఆరు ప్రాజెక్టులు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక శ్రీలీల చేస్తున్న ప్రాజెక్టులతో స్టార్ హీరోయిన్లు సహా మిగతా హీరోయిన్లందరినీ శ్రీలీల సైడ్ చేసేలా కనిపిస్తోంది.

Updated On 17 March 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story