కాళ్లరిగేలా తిరిగినా కొందరికి సినిమా అవకాశాలు రావు. కొందరికేమో కాళ్ల దగ్గరకే అవకాశాలు వచ్చిపడతాయి. ఇలాంటి అదృష్టం శ్రీలక్ష్మి సతీశ్‌(Shri Lakshmi Satish)కు దక్కింది. ఎవరీమే అన్న సందేహం వచ్చేసింది కదూ! ఈమె గురించి చెప్పుకోవాలంటే రామ్‌గోపాల్‌వర్మ(RGV)ను కూడా ప్రస్తావించాల్సి వస్తుంది.

కాళ్లరిగేలా తిరిగినా కొందరికి సినిమా అవకాశాలు రావు. కొందరికేమో కాళ్ల దగ్గరకే అవకాశాలు వచ్చిపడతాయి. ఇలాంటి అదృష్టం శ్రీలక్ష్మి సతీశ్‌(Shri Lakshmi Satish)కు దక్కింది. ఎవరీమే అన్న సందేహం వచ్చేసింది కదూ! ఈమె గురించి చెప్పుకోవాలంటే రామ్‌గోపాల్‌వర్మ(RGV)ను కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. ఆయన ఏం చేసినా అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. వర్మ ట్వీట్‌ చేసినా, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినా ఆటోమాటిక్‌గా అది సంచలనం అవుతుంటుంది. కొద్ది రోజుల కిందట చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేశారు వర్మ. ఆమె ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్‌ చేశారు. దాంతో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోనే ప్రయత్నంలో పడ్డారు నెటిజన్లు. చివరకు ఆమె కేరళ(Kerala)కు చెందిన అమ్మాయి అని తెలిసింది. రామ్‌గోపాల్‌ వర్మ ఆ యువతి రీల్‌ షేర్‌ చేయడంతో ఒక్కసారిగా ఆమెకు ఫాలోవర్స్‌ పెరిగారు. ఆ తర్వాత ఆర్జీవీ తనను పొగిడారని ఆమె తెగ సంతోషపడ్డారు. లేటెస్ట్‌గా ఆ యువతితోనే సినిమా తీసేందుకు వర్మ రెడీ అయ్యారు. ఆమెతో శారీ అనే(Saaree Movie) సినిమా తీయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మొత్తానికి వర్మ అనుకున్నంత పని చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క వీడియోతో వైరల్‌ అయిన యువతి ఏకంగా హీరోయిన్‌ అవకాశాన్ని సంపాదించడమంటే మాటలు కాదు. ఈ సినిమాతో శ్రీలక్ష‍్మి సినిమాల్లోకి వస్తున్నారు. ఆర్జీవీ డెన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు అఘోశ్ వైష్ణవం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది.

Updated On 21 Dec 2023 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story