టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా గతేడాది నిలిచింది శ్రీలీల. అటు టాప్ హీరోలతో

టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా గతేడాది నిలిచింది శ్రీలీల. అటు టాప్ హీరోలతో.. ఇటు యంగ్ హీరోలతో జతకట్టింది ఈ తెలుగు పిల్ల. నెలకొక సినిమా చొప్పున శ్రీలీల సినిమాలు విడుదలయ్యాయంటే ఆమె ఫాలోయింగ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాలో కనిపించి అలరించింది. తాజాగా అమ్మడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అమ్మడు సినిమాలకు బ్రేక్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్‌బీబీఎస్ చదువుతూ సినిమాలు చేస్తూ ఉంది శ్రీలీల. కొద్దిరోజుల కిందట పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసకున్నప్పటికీ ఆమె ఇప్పటివరకూ కొత్త సినిమాకి సైన్ చేయడం లేదు. అయితే శ్రీలీల కావాలనే బ్రేక్ తీసుకుందా.. లేక ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకోబోతోందా అని తెలియాల్సి ఉంది. ఇక శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది. గతేడాది శ్రీలీల నటించిన చాలా సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తేనే కెరీర్ బాగుంటుందని శ్రీలీల భావిస్తూ ఉంటుంది. అందుకే ఆమె బ్రేక్ కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు. ఏది ఏమైనా శ్రీలీల స్పందిస్తే ఓ క్లారిటీ అంటూ వస్తుంది.

Updated On 29 Feb 2024 11:42 PM GMT
Yagnik

Yagnik

Next Story