శ్రీలీల యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్

శ్రీలీల యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. అమ్మడికి హిట్స్ పెద్దగా దక్కకపోయినా.. అవకాశాలు మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ యంగ్ బ్యూటీ వరుసగా స్టార్-హీరోల చిత్రాలలో కూడా నటించింది. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు గుంటూరు కారం (2024)తో మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. అయితే ఇప్పుడు శ్రీలీల ఆచితూచి సినిమాలను చేయాలనీ అనుకుంటూ ఉంది. ముఖ్యంగా తన కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమాల్లో నటించాలని అనుకుంటూ ఉంది. ఆమె సినిమాల నుండి కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నటించిన సినిమాల్లో విడుదలవ్వని ఏకైక తెలుగు సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'.

ఇలాంటి సమయంలో ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొత్త ప్రాజెక్ట్‌కి సంతకం చేసింది. అయితే ఇది తెలుగు సినిమా కాదని అంటున్నారు. ఈసారి బాలీవుడ్‌లో శ్రీలీల నటించనుంది. శ్రీలీల కన్నడ సినిమాలో నటించిన తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ మూవీకి సైన్ చేసిందని అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం సరసన నటించడానికి అంగీకరించింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాలో శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 2024లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా శ్రీలీలకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Updated On 8 Jun 2024 2:19 AM GMT
Yagnik

Yagnik

Next Story