అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya)తో శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) డేటింగ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా కోడైకూస్తోంది. గత ఏడాదిగా చిత్ర పరిశ్రమ నుంచి మొదలు పెడితే కామన్ మ్యాన్ వరకు ఈ డేటింగ్‌పై వార్తలు షికారు చేస్తున్నాయి దానికితోడు ఏదోఒక ఫొటో వైరల్ అవడంతో ఈ ఇష్యూకి ఇంకాస్త బలం చేకూరినట్టు అయింది. రీసెంట్గా లండన్‌లో ఈ జంట ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వెరల్‌గా మారింది.
అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya)తో శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) డేటింగ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా కోడైకూస్తోంది. గత ఏడాదిగా చిత్ర పరిశ్రమ నుంచి మొదలు పెడితే కామన్ మ్యాన్ వరకు ఈ డేటింగ్‌పై వార్తలు షికారు చేస్తున్నాయి దానికితోడు ఏదోఒక ఫొటో వైరల్ అవడంతో ఈ ఇష్యూకి ఇంకాస్త బలం చేకూరినట్టు అయింది. రీసెంట్గా లండన్‌లో ఈ జంట ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వెరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ డేటింగ్ వ్యవహారంపై తొలిసారిగా శోభితా ధూళిపాళ రియాక్ట్ అయింది. ఇంతకీ నటి శోభిత ఏమన్నదో తెలియాలంటే మీరిది చదవాల్సిందే మరి.
నాగచైతన్యతో డేటింగ్ వార్తలపై స్పందించిన శోభిత (Sobhita Dhulipala) ఇలా చెప్పుకొచ్చింది... ‘‘ చాలా మంచి సినిమాల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని, డ్యాన్స్ అంటే ఇష్టం. డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) సినిమాల్లో మూడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) పాటలకు పెర్ఫామెన్స్ ఇవ్వడం నాకు చాలా పెద్ద విషయం. ఇప్పుడు నేను పూర్తిగా నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. నాలెడ్జ్ లేకుండా మాట్లాడే వ్యక్తులకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. నేను ఏ తప్పూ చేయడం లేదు.. అయినా అది మీకు అవసరం లేదు. హాఫ్ నాలెడ్జ్ తో మీరు రాసే విషయాలకు నేను సమాధానాలు ఇవ్వలేను.. మీరు మీ జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టండి.. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించండి.. ప్రశాంతంగా ఉండిండి, ఒక మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి అంటూ కాస్త ఘాటుగానే మండిపడింది ఈ మేజర్ భామ’’.
ఇదిలా ఉంటే ఇక నాగచైతన్య కూడా తన లవ్ లైఫ్ (Love Life)పై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. తనను మూడో వ్యక్తితో లింక్ పెడుతున్నారని అన్నాడు. ఇదంతా కేవలం హెడ్‌లైన్స్ కోసమే నన్ను మూడో వ్యక్తికి లింకు పెడుతున్నారని.. రూమర్స్ క్రియేట్ చేస్తున్నారన్నారు. ఇదంతా తనను చాలా బాధ పెడుతుందని చైతన్య చెప్పుకొచ్చారు. ఇలా తనను మూడో వ్యక్తికి లింకుపెట్టడం సరికాదని.. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇక అలా వదిలేయమని.. దీన్ని ఇంతటితో ఆపేస్తారని ఆశిస్తున్నానని హీరో నాగచైతన్య చెప్పాడు.