గూఢచారి సినిమా(Goodachari Movie)తో టాలీవుడ్(Tollywood)లో అడుగుపెట్టిన అందమైన భామ శోభిత ధూళిపాల(Sobhita Dhulipala). మేజర్ సినిమా(Major Movie)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక సినిమా పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan)లో చాలా అందంగా కనిపించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

The Night Manager Shobhita
గూఢచారి సినిమా(Goodachari Movie)తో టాలీవుడ్(Tollywood)లో అడుగుపెట్టిన అందమైన భామ శోభిత ధూళిపాల(Sobhita Dhulipala). మేజర్ సినిమా(Major Movie)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక సినిమా పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan)లో చాలా అందంగా కనిపించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్(Bollywood)లో నటిస్తున్నారు. వరుస ఆఫర్లతో చాలా బిజీగా ఉన్నారు. సినిమాల కంటే వెబ్ సిరీస్‌లపైనే ఎక్కువ దృష్టి పెట్టారు శోభిత ధూళిపాల. ఆమె నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్-2(The Night Manager) జూన్ 29 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో శోభిత మరింత బోల్డ్‌గా నటించారని అంటున్నారు. ఆదిత్యరాయ్ కపూర్(Aditya Roy Kapoor)తో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్‌లో శోభిత రెచ్చిపోయి నటించారన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రొమాంటిక్ సీన్స్‌లో శోభిత.. తమన్నాను మించిపోయారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ బ్రిటన్‌కు చెందిన సిరీస్ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. సందీప్ మోదీ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, తిలోటమా షోమ్, శాశ్వత ఛటర్జీ, రవి బెహ్ల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నట్టు గతంలో శోభిత ధూళిపాల, అక్కినేని నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నట్టు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే!
