ఒకప్పటి అందాల తార స్నేహ(Sneha)కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. హీరోయిన్‌ పాత్రల నుంచి స్నేహ దూరమైనప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా(Social Media) ద్వారా ఫ్యాన్స్‌కు దగ్గరవుతుంటారు స్నేహ. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. తన నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకున్న స్నేహ ఆ మధ్య భర్తతో విడాకులు తీసుకోనుందంటూ వదంతులు వచ్చాయి.

ఒకప్పటి అందాల తార స్నేహ(Sneha)కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. హీరోయిన్‌ పాత్రల నుంచి స్నేహ దూరమైనప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా(Social Media) ద్వారా ఫ్యాన్స్‌కు దగ్గరవుతుంటారు స్నేహ. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. తన నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకున్న స్నేహ ఆ మధ్య భర్తతో విడాకులు తీసుకోనుందంటూ వదంతులు వచ్చాయి. సోషల్‌ మీడియాలో దీనిపై చర్చ కూడా జరిగింది. దీంతో హీరోయిన్‌ తన భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసి అసత్య కథనాలకు చెక్‌ పెట్టారు స్నేహ. ఎప్పుడూ అందమైన ఫోటోలు షేర్‌ చేసే స్నేహ లేటెస్ట్‌గా ఓ వర్కవుట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఆమె బరువు ఎత్తుతూ ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వీడియో చూస్తే చాలా కష్టంగా ఆమె బరువును ఎత్తుతున్నట్టు అర్థమవుతోంది. అంత కష్టపడి అంతేసి బరువును మోయడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఎక్సర్‌సైజ్‌ల వల్ల గుండెపోటు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని, చాలామంది సెలబ్రిటీలు ఇదే కారణంతో చనిపోతున్నారని సూచిస్తున్నారు ఈ బరువులు ఎత్తడానికి బదులుగా యోగా చేయవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. భారీ బరువులు ఎత్తడం వల్ల గుండెపోటు ప్రమాదాలు పెరుగుతున్నందున ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2001లో ప్రియమైన నీకు సినిమాతో తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన స్నేహ తర్వాత హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, సంక్రాంతి, రాధా గోపాళం, శ్రీ రామదాసు, రాజన్న వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించారు. ఆమె తెలుగులో చివరగా 2019లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో కనిపించారు.

Updated On 11 Aug 2023 7:30 AM GMT
Ehatv

Ehatv

Next Story