తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ సినిమా లియో(Leo).. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం విజయ్‌ తన 68వ సినిమాకు సిద్ధమవుతున్నారు. వెంకట్‌ ప్రభు(Venkat prabhu) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.

తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ సినిమా లియో(Leo).. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం విజయ్‌ తన 68వ సినిమాకు సిద్ధమవుతున్నారు. వెంకట్‌ ప్రభు(Venkat prabhu) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఇందులో కొడుకు పాత్రకు జోడిగా ప్రియాంక మోహన్‌ను(Priyanka mohanan) ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే తండ్రిగా నటించనున్న విజయ్‌ సరసన నటించే హీరోయిన్‌ గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ పాత్రకు నటి జ్యోతిక(Jyothika) నటించనున్నట్టు ప్రచారం జరిగింది. కారణాలేమిటో తెలియదు కానీ జ్యోతిక నటించడం లేదని తెలిసింది. తర్వాత సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ను అప్రోచ్‌ అయ్యారు. సిమ్రాన్‌ ఈ పాత్రకు ఒప్పుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు నటి స్నేహ(Sneha) పేరు తెర మీదకు వచ్చింది. ఆమెతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు మేకర్స్‌. వీరిద్దరు కలిసి నటించి రెండు దశాబ్దాలు అవుతోంది. చివరి సారిగా వీరిద్దరు 20 ఏళ్ల కిందట వశీకర సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్‌ సరసన నటించే అవకాశం స్నేహకు వచ్చింది. మరి విజయ్‌తో కలిసి నటించడానికి స్నేహ ఒప్పుకుంటారా? లేక కాదంటారా? అన్నది చూడాలి. కాగా విజయ్‌ 68వ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు లండన్లో జరుగుతున్నాయి. ఆ పనులు ముగియగానే సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందని సమాచారం.

Updated On 5 Sep 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story