ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు హాజరైన శృతిహాసన్ (Shruti Haasan) తన అందచందాలతో ఆకట్టుకుంది. ఆ ఈవెంట్ తర్వాత ఈ భామ లండన్ వెళ్లి తన ప్రియుడు శాంతాను హజారికా(Santanu Hazarika)ను కలిసింది. అయితే ఈ భామ తన బాయ్ ఫ్రెండ్‌ను చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు హాజరైన శృతిహాసన్ (Shruti Haasan) తన అందచందాలతో ఆకట్టుకుంది. ఆ ఈవెంట్ తర్వాత ఈ భామ లండన్ వెళ్లి తన ప్రియుడు శాంతాను హజారికా(Santanu Hazarika)ను కలిసింది. అయితే ఈ భామ తన బాయ్ ఫ్రెండ్‌ను చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆపుకోలేక కాస్త ప్రేమ ఎక్కువగానే అతగాడిపై చూపించింది శృతి. అయితే ఆ బ్యూటిఫుల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె డ్యాన్స్ చేస్తూ.. శాంతాను కౌగిలించుకుంది. అతని చెంపపై ఇంకా తలపై ముద్దుల వర్షం కురిపించింది ఈ భామ.
ఇక ఆ వీడియోకు ‘‘నాకు ఇష్టమైన నగరంలో నాకు ఇష్టమైన మనిషితో రాత్రి గడపడం’’ అని శాంతాను హజారికాకు ట్యాగ్ చేసింది. దాంతోపాటు అడిషనల్‌గా శాంతాను హజారికా(Santanu Hazarika)తో ఉన్న మరో ఫొటోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారు. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. 2018లో శాంతాను కలిశాడని.. ఫస్ట్ అతనే ప్రపోజ్ చేశాడని ఈ భామ చెప్తుంది. విజువల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో తనకున్న రిలేషన్షిప్ గురించి ఈ అమ్మడు చాలా గొప్పగా చెబుతుంది.
ఇక కేన్స్‌లో ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా కనిపించింది. ఫ్రెండ్ రివేరాలో గడిపిన ఫొటోలను శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేసింది. బ్లాక్ లేటెక్స్ డ్రెస్‌లో అందాల ఆరబోతతో పర్ఫెక్ట్గా కనిపిచింది శృతిహాసన్. ఎప్పటిలానే ఈ భామ తన జుట్టుకు పైకికట్టుకుని అందంగా కనిపించింది. మరోవైపు కేన్స్‌లో శృతి లుక్ తన బాయ్ ఫ్రెండ్‌ను కూడా అట్రాక్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు ఇంప్రెస్ అయ్యి ఫైర్ ఎమోజీలను కామెంట్ సెక్షన్ బాక్సులో వదిలాడు.