ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, జనసేనాని(Janasena) పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారట!

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, జనసేనాని(Janasena) పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారట! ఈ మాటన్నది నటి శ్రియ(Sriya). గతంలో పవన్‌తో కలిసి ఈమె బాలు అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌ ఇనాగరేషన్‌లో పాల్గొన్న శ్రియ పవర్‌స్టార్‌ను ఆకాశానికెత్తేసింది. పవన్ గురించి చాలా చెప్పింది. 'ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆయనను చూసి నేను ఎంతో గర్విస్తున్నా. మేమిద్దరం గతంలో బాలు అనే సినిమా కోసం కలిసి పని చేశాం. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైంది. పాట షూట్‌ పూర్తయ్యేవరకూ ఆ విషయాన్ని ఎవరితోనూ ఆయన చెప్పలేదు. ప్రజలకు మంచి చేయాలని తపన ఉన్న మనిషి. ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నా’ అని శ్రియ తెలిపారు. అలాగే చిరంజీవితో కలిసి మరోసారి పని చేయాలనుకుంటున్నానని తెలిపింది.

Eha Tv

Eha Tv

Next Story