అగ్ర కథానాయిక సమంత(samantha) నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అక్కినేని నాగ చైతన్యతో(Akkikeni Nagachaithanya) విడాకులు తీసుకుని చాన్నాళ్లవుతున్నా ఇంకా ఆనిపైనే కొందరు చర్చిస్తున్నారు. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత. ఎందుకో ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటున్నారు.
అగ్ర కథానాయిక సమంత(samantha) నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అక్కినేని నాగ చైతన్యతో(Akkikeni Nagachaithanya) విడాకులు తీసుకుని చాన్నాళ్లవుతున్నా ఇంకా ఆనిపైనే కొందరు చర్చిస్తున్నారు. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత. ఎందుకో ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సమంత మళ్లీ ప్రేమలో పడ్డారా అన్న అనుమానం కలుగుతోంది చాలా మందికి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో ఆల్‌మోస్టాల్ స్టార్ హీరోలందరితో కలసి సినిమాలు చేశారు సమంత. కాకపోతే గత కొన్నాళ్లుగా సమంతకు కాలం కలిసిరావడం లేదు. లాస్టియర్ వచ్చిన యశోద(Yashodha) సినిమా, ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన శాకుంతలం(Shakunthalam) సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు.
ప్రస్తుతం సమంత నటిస్తున్న ఖుషి(Kushi) త్వరలో రిలీజ్ కాబోతున్నది. అలాగే వెబ్ సిరీస్ సిటాడెట్(citadel) కూడా! మయోసిటిస్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ట్రీట్‌మెంట్ కోసం సినిమాకు విరామం ప్రకటించారు. ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడయ్యారు. ఇదిలా ఉంచితే ఈ మధ్య ప్రేమ గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను చాలా పోస్ట్ చేస్తున్నారు సమంత. లేటెస్ట్‌గా ఎక్కువ ద్వేషించే మనుషులు, మాటలు చూసి ఉంటావేమో కానీ ఈ ప్రపంచంలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అని ఓ కొటేషన్ పిక్చర్‌ను షేర్ చేశారు. గతంలో ఇలాంటి ప్రేమకు సంబంధించిన ప్టేటస్‌లను అప్పుడప్పుడు సమంత పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇదేదో ఒకటో రెండుసార్లు కాదు. అప్పుడప్పుడు ఇలాంటి పిక్చర్లను చూస్తున్న సమంత అభిమానులకు సమంత మరోసారి ప్రేమలో పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ సమంత ప్రేమలో పడితే ఆ ప్రేమను దక్కించుకున్న వ్యక్తి ఎవరై ఉంటారా అని కామెంట్ చేస్తున్నారు. దీని గురించి సమంత వివరణ ఇస్తే తప్ప అసలు విషయం తెలియదు.