టాప్‌ హీరోయిన్‌ సమంత(Samantha), అక్కినేని నాగ చైతన్య(Akkineni naga chaithanya) విడిపోయి చాన్నాళ్లయ్యిది.

టాప్‌ హీరోయిన్‌ సమంత(Samantha), అక్కినేని నాగ చైతన్య(Akkineni naga chaithanya) విడిపోయి చాన్నాళ్లయ్యిది. అప్పటికీ సోషల్‌ మీడియాలో వీరిపై గ్యాసిప్స్‌ వస్తుంటాయి. వీరిద్దరు వాటిని పెద్దగా పట్టించుకోరనుకోండి. ఎవరికి వారు తమ పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో(Amazon prime) స్ట్రీమింగ్‌ అవుతున్ సిటాడెల్‌(Citadel) వెబ్ సిరీస్‌ ప్రమోషన్లలో సమంత బిజీగా ఉన్నారు. నాగచైతన్య తండేల్(Thandel) సినిమా చేస్తున్నాడు. సిటాడెల్‌ ప్రమోషన్లలో భాగంగా రీసెంట్‌గా వరుణ్‌ ధావన్‌తో(Varun dhawan) కలిసి సరదా చిట్‌చాట్‌లో సమంత పాల్గొన్నారు. సమంతతో వరుణ్‌ ధావన్‌ స్పైసీ రాపిడ్‌ ఫైర్‌ నిర్వహించాడు. రూలేమిటంటే అన్సర్‌ ఇవ్వడం ఇష్టం లేకపోతే పచ్చి మిరపకాయ తినాలి. ఇందులో వరుణ్‌ ఓ ప్రశ్న అడిగాడు. అదేమిటంటే 'నీ జీవితంలో అవసరం లేకపోయినా అత్యధిక డబ్బులు దేని కోసం ఖర్చు చేశారు?’ అని! సమంత ఏమాత్రం తడుముకోకుండా ‘నా మాజీ కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశాను’ అని జవాబిచ్చారు. వాటి ధర ఎంత ఉంటుందని వరుణ్‌ ప్రశ్నను కొనసాగించాడు. దానికి ‘కాస్త ఎక్కువే..ఇక విషయం మాట్లాడదామా’ అంటూ ఆ టాపిక్‌కు అక్కడితో ముగింపు పలికారు సమంత . సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 2017లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంతలు 2021లో విడాకులు(Divorce) తీసుకున్నారు. మరో ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌ గురించి చెబుతూ బాధపడ్డారు సమంత. ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారన్నారు సమంత. విడాకుల తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌ అంటూ కొన్ని ట్యాగులను తలిగిస్తుందని ఆవేదన చెందారు. ఇలాంటి ట్యాగ్స్‌ని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు యాడ్‌ చేస్తారో అర్థం కాదని, కష్టాల్లో ఉన్న అమ్మాయికి ఇలాంటి మాటలు మరింత బాధను కలిగిస్తాయని సమంత ఆవేదన చెందారు. తన విడాకుల విషయంలో కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని, అవన్నీ అబద్దాలే కాబట్టి తాను స్పందించలేదని, కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుతో పాటు చాలా మంది తనకు మద్దతుగా నిలిచారని సమంత చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story