✕
Saiee Manjrekar : వైట్ డ్రెస్‌లో మెరిపిస్తోన్న మేజర్ భామ.. !
By EhatvPublished on 29 April 2023 1:28 AM GMT
సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar).. ఈ భామ తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ వైట్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

x
Saiee Manjrekar
-
- సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar).. ఈ భామ తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన గని (Ghani) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. చిత్రం చివరికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి వెళ్లినా అక్కడా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత సాయి మంజ్రేకర్‌కు లక్ బాగా కలిసొచ్చింది.
-
- ఆ చిత్రం తర్వాత విడుదలైన మేజర్ (Major) చిత్రంతో భారీగా ప్రేక్షక ఆదరణ పొందింది ఈభామ. అడివి శేషు సరసన నటించిన ఆ సినిమా ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని సాధించింది. మేజర్ ఉన్నికృష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను ఎక్కువగా ఎమోషన్‌కు గురి చేసింది.
-
- ఆ తర్వాత ఈ భామకు కాస్త గ్యాప్ రావడంతో.. ఇక ఈ ఇయర్లో ఈమె బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయబోతుందని ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆమె రియాక్ట్ అయింది. ప్రస్తుతం కుచ్ కట్టా హోజాయే (Kuch Khattaa Ho Jaay) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆరోమే కహా దూం థా (Auron Mein Kaha Dum Tha) చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
-
- ఇదిలా ఉంటే తెలుగులో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా వస్తున్న ఓ సినిమాలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ఇప్పుడు ఆమె చేస్తున్న రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ యాక్టర్స్‌తో వర్క్ చేసినప్పుడు ఆనందంగా ఉంటుందని, సెట్లో ఉండి అబ్జర్వ్ చేయడం వంటిది ఓ మంచి అనుభవం అని ఈ భామ అంటోంది.
-
- కుచ్ కట్టా హో జాయే చిత్రంలో తాను ఇరా అనే క్యారెక్టర్ చేస్తున్నానని.. ఐఏఎస్ కావాలని కలలు కనే బలమైన కోరిక ఉన్న యువతి క్యారెక్టర్ అని చెప్తోంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్‌లో జోరును పెంచుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామ వైట్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

Ehatv
Next Story