హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) మరోసారి జంటగా కనిపించబోతున్నారు. 2021లో వచ్చిన లవ్‌స్టోరీ(Love Story) వంటి సూపర్‌హిట్ సినిమాలో నటించిన వీరిద్దరు మరోసారి వెండితెరపై అలరించనున్నారు.

Sai Pallavi-Nagachaithanya
హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) మరోసారి జంటగా కనిపించబోతున్నారు. 2021లో వచ్చిన లవ్‌స్టోరీ(Love Story) వంటి సూపర్‌హిట్ సినిమాలో నటించిన వీరిద్దరు మరోసారి వెండితెరపై అలరించనున్నారు. చందు మొండేటి(Chandhu Mondeti) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్(Allu Arvindh) సమర్పణలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. బన్నీ వాసు దీనికి నిర్మాత. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే స్పీడ్‌గా జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా కథానాయిక ఎంపిక కోసం కసరత్తులు చేసిన మూవీ మేకర్స్ బుధవారం అధికారికంగా సాయిపల్లవి పేరుని ప్రకటించారు. సాయిపల్లవి ఇప్పటికే చిత్రబృందంతో కలిశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. నాగచైతన్య, చందు మొండేటి కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్ చిత్రం కాబోతున్నది.
