తేజ(Teja) దర్శకత్వంలో వచ్చిన జయం(Jayam) సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు సదా(Sadha). మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్నారు. స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయారు. తమిళంలోనూ నటించారు. శంకర్‌(Shankar) దర్శకత్వంలో విక్రమ్‌(Vikram) హీరోగా వచ్చిన అపరిచితుడు(aparichithudu) సినిమాలో హీరోయిన్‌గా నటించిన సదాకు మంచి పేరు వచ్చింది.

తేజ(Teja) దర్శకత్వంలో వచ్చిన జయం(Jayam) సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు సదా(Sadha). మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్నారు. స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయారు. తమిళంలోనూ నటించారు. శంకర్‌(Shankar) దర్శకత్వంలో విక్రమ్‌(Vikram) హీరోగా వచ్చిన అపరిచితుడు(aparichithudu) సినిమాలో హీరోయిన్‌గా నటించిన సదాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో దక్షిణాదిలో పాపులారిటీ పెరిగింది. అప్పట్లో సదా పేరు అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ మారుమోగింది. అయితే అపరిచితుడు సినిమా తర్వాత సదా నటించిన చిత్రాలేవి పెద్దగా విజయం సాధించలేకపోయాయి.

సినిమాలు ఆడకపోవడంతో సదాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే పలు టీవీ షోలకు(TV Shows) జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇలా కెరీర్‌ పరంగా సదా మళ్లీ బిజీ అయ్యారు.

ఇప్పటి వరకు అవివాహితగా ఉండిపోయిన సదా అందుకు కారణమేమిటో చెప్పారు. ఆమెతో పాటు పరిశ్రమలో అడుగు పెట్టిన హీరోయిన్లందరూ పెళ్లిళ్లు చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నారు. పిల్లలను కూడా కన్నారు. సదా మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో కారణం చెప్పారు. 'పెళ్లి చేసుకుంటే ఫ్రీడం పోతుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇష్టమైన పని చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు. మనల్ని అర్థం చేసుకునే వాళ్లు దొరికితే పర్వాలేదు కానీ.. లేకపోతే? పైగా ఇప్పుడు చాలా మంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని.. కొద్ది రోజులకే విడిపోతున్నారు. ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోవడం ఎందుకు? దాని కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే ఉత్తమం కదా’ అని సదా చెప్పుకొచ్చారు.

Updated On 13 July 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story