మొన్నటి వరకూ తెలుగు తెరపై వెలుగు వెలిగింది హీరోయిన్ రెజీనా కసాండ్ర. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. స్టార్ హీరోల సరసన మెరవకపోయినా..దాదాపు 2 టైర్ హీరోలందరితో సినిమాలు చేసింది ముద్దు గుమ్మ. ఎక్కువ హిట్లు సాధించింది. హీరోయిన్ గా అవకాశాలుతగ్గుతున్నా.. వెంటనే వెబ్ సిరీస్ ల వెంట పడింది. మంచిమంచి అవకాశాలు సాధించి..

తాను కూడా కాస్టింగ్ కౌచ్(Casting Couch) బాధితురాలినే అంటోంది హీరోయిన్ రెజీనా కసాండ్ర(Regina Cassandra). తాను కమిట్ మెంట్ ఇస్తేనే.. సినిమా ఛాన్స్ ఇస్తా అని తనతో అన్నారంటోంది. ఇంతకీ ఆమె ఆరోపణలు ఎవరి మీద...?

మొన్నటి వరకూ తెలుగు తెరపై వెలుగు వెలిగింది హీరోయిన్ రెజీనా కసాండ్ర. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. స్టార్ హీరోల సరసన మెరవకపోయినా..దాదాపు 2 టైర్ హీరోలందరితో సినిమాలు చేసింది ముద్దు గుమ్మ. ఎక్కువ హిట్లు సాధించింది. హీరోయిన్ గా అవకాశాలుతగ్గుతున్నా.. వెంటనే వెబ్ సిరీస్ ల వెంట పడింది. మంచిమంచి అవకాశాలు సాధించి.. లైమ్ లైట్ లో ఉండేలా చూసుకుంటుంది.

అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ను ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసినవారే.. పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఇప్పటికే ఎంతో మంది బహిరంగంగా మాట్లాడారు. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా తాము కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి వేధింపులు ఫేస్ చేశామని చెప్పుకొచ్చారు. విచిత్రం ఏంటంటే మగవారు కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులుగా ఉండటం ఆశ్చర్యం ఈక్రంమలో తాజాగా మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. తన అనుభావాలు పంచుకుంది. తాను అనుభవించి బాధను వెల్లడించింది.

తాజాగా హీరోయిన్ రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. తాను కూడా వేధింపులకు గురయ్యానని ఆమె తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి తనకు కాల్ వచ్చిందని... అడ్జెస్ట్ మెంట్ కు ఓకే అయితే సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడని వెల్లడించింది. వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడదామన్నాడని చెప్పింది. అయితే అడ్జెస్ట్ మెంట్ అంటే ఏమిటో కూడా తనకు తెలియదని, అదే విషయాన్ని తన మేనేజర్ ను అడిగితే వివరించాడని తెలిపింది రెజీనా.

పదేళ్ల క్రితం తనకు ఈ అనుభవం ఎదురయిందని, ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలాంటి ఘటన జరగలేదని చెప్పింది. ప్రస్తుతం రెజీనా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. శివ మనసులో శృతి (SMS) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి రెజీనా. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గా సైమా అవార్డ్ లభించింది. ఈ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలు చేసి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలు చేస్తునే ఓటీటీ వెబ్ సిరీలస్ లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Updated On 18 Aug 2023 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story