తెలుగు సినీ ప్రేక్షకులకు రెజీనా కసాండ్రా(Rezina casandra) గురించి ఇంట్రో అక్కర్లేదు.
తెలుగు సినీ ప్రేక్షకులకు రెజీనా కసాండ్రా(Rezina casandra) గురించి ఇంట్రో అక్కర్లేదు. తెలుగులో పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కొత్త జంట వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటించారు. లేటెస్ట్‌గా ఉత్సవం(Ustavam) సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చారు. దిలీప్ ప్రకాశ్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటించిన ఉత్సవం సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహించాడు. హార్న్‌బిల్ పిక్చర్స్ పతాకంపై సురేశ్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఇవాళే విడుదలయ్యింది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా రెజీనా కొన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను చాలా మందితో రిలేషన్‌లో ఉన్నానని షాకింగ్ స్టేట్‌మెంట్ చేశారు. అయితే తనకు చాలా ప్రపోజల్స్ ఉన్నాయని, ఈ విషయంలో తాను ఒక సీరియల్ డేటర్ అని చెప్పొచ్చు అని రెజీనా తెలిపారు. ప్రస్తుతం వీటన్నింటికీ దూరంగా ఉన్నానన్నారు. గతంలో రెజీనా గురించి అనేక వదంతులు వచ్చాయి. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింద. అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమేనని, అందులో నిజం లేదని సందీప్ కిషన్ స్పష్టం చేయడంతో రూమర్స్ ఆగిపోయాయి.