1990 దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన హీరోయిన్లలో రవీనాటాండన్ ఒకరు.
1990 దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన హీరోయిన్లలో రవీనాటాండన్ ఒకరు. ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 2022 ఏప్రిల్ 14న విడుదలైన కేజీయఫ్: చాప్టర్ 2 సినిమాలో రమికా సేన్‌గా నటించి రవీనా టాండన్ ప్రేక్షకుల్ని మెప్పించారు. రవీనా టాండన్ కు 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా, ఆమె రాష్టప్రతి భవన్లో 2023 ఏప్రిల్ 05న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా పురస్కారాన్ని అందుకుంది. 1974 అక్టోబరు 26న ముంబైలో ఆమె జన్నించారు. ఆమె అనిల్ థడానీని 2004లో పెళ్లి చేసుకున్నారు. ఓ కుమార్తె రాషా తడాని, కుమారుడు రణబీర్ ఉన్నారు. ఆమె 1991లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి..సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేశారు.. ఆ తర్వాత జీనా మర్నా టేరే సేంగ్, దివ్యశక్తి, క్షత్రియ వంటి సినిమాల్లో నటించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. రథసారథి అనే తెలుగు చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రవీనా టాండన్‌కు ఆ సినిమా అంతగా బ్రేక్ ఇవ్వలేదు.
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన బంగారు బుల్లోడు సినిమా రవీనాకు మంచి పేరు వచ్చింది. స్వాతిలో ముత్యమంత సాంగ్‌లో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది రవీనా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ తెలుగులో ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్‌పై రవీనా ఫోకస్ చేశారు. సాధు అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు రవీనా టాండన్.
కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించిన ఉపేంద్ర సినిమాలో హీరోయిన్‌గా నటించి మరోసారి తన అందాలతో ఊపేసింది. 2001లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఆకాశ వీధిలో చిత్రంతో మరోసారి తెలుగువారిని పలకరించారు రవీనా. దాదాపు 13 ఏళ్ల తర్వాత మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నటించిన పాండవులు పాండవులు తుమ్మెదలో కనిపించి అలరించింది . ఇక ఇటీవల కేజీఎఫ్ చాప్టర్‌లో కీలకపాత్ర పోషించిన రవీనా తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రస్తుతం వెల్‌కమ్ టూ జంగిల్, జాలీ ఎల్ఎల్‌బీ సినిమాలలో ఆమె నటిస్తున్నారు. 50 వయసులో కూడా చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు రవీనా టాండన్.
అయితే సినిమా షూటింగ్‌లు అంత తేలికైన విషయం కాదు. ఒక సినిమా షూటింగ్‌కు అనేక కష్టనష్టాలుంటాయి. ఒక్క షాట్ తీయాలంటే ఎంతో కష్టం.. డైరెక్టర్ అనుకున్న విధంగా షాట్ రావడం ఒక్కోసారి సింగిల్ టేక్‌లో జరగకపోవచ్చు. అయితే షూటింగ్ స్పాట్‌లలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. అవి ప్రమాదాలు కావొచ్చు, లేదంటే నటీనటుల మధ్య మనస్పర్ధలు కావొచ్చు. ఏం జరిగినా చిత్రీకరణపై ప్రభావం చూపుతుంది. అలా తన కెరీర్‌లో జరిగిన ఓ అనుభవాన్ని పంచుకున్నారు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ హీరోతో లిప్‌లాక్ సీన్ తనను ఇబ్బంది పెట్టిందని ఆమె చెప్పుకొచ్చారు. హీరోది తప్పు కానప్పటికీ అనుకోకుండా హీరో పెదాలు తన పెదాలకు తాకాయని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే వాష్ రూంకు వెళ్లి వాంతులు చేసుకున్నాని చెప్పుకొచ్చారు. సీన్‌లో ముద్దు పెట్టాలని లేకపోయినా అలా తప్పు జరిగిందని రవీనా తెలిపారు. దీంతో తాను చాలా ఇబ్బంది పడ్డానని.. కడుపులో వికారంగా తిప్పేయడంతో తీసుకోలేకపోయానని వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్లి వాంతులు చేసుకున్నానని రవీనా టాండన్ పేర్కొన్నారు. 100 సార్లు బ్రష్ చేసుకున్నానన్నారు. ఆ హీరో తనకు సారీ చెప్పాడని.. ఇందులో హీరో తప్పు కూడా ఏమీ లేదన్నారు. తాను లిప్‌లాక్ సీన్లలో నటించబోనని డైరెక్టర్లకు చెప్పేదాన్ని అని.. అసభ్య సీన్లకు తాను వ్యతిరేకంగా ఉండేదాన్ని అని రవీనా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ ఆమె ఆ హీరో పేరు వెల్లడించకపోవడం గమనార్హం.