రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna)మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ ఉందనేది చాలా మంది అనుమానం! విజయ్‌, రష్మికలు మాత్రం అబ్బే మా మధ్య లవ్వు లేదు గివ్వులేదు అని చెబుతూ ఉంటారు. ఫ్యాన్స్‌ మాత్రం వారి మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇద్దరూ కలిసి తరచూ రహస్యంగా షికారులకు వెళ్లడం, డిన్నర్‌ డేట్‌కు(Dinner Dates) వెళ్లడం, వెకేషన్‌లో ఎంజాయ్‌ చేయడం వంటివి చేస్తున్నారు.

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna)మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ ఉందనేది చాలా మంది అనుమానం! విజయ్‌, రష్మికలు మాత్రం అబ్బే మా మధ్య లవ్వు లేదు గివ్వులేదు అని చెబుతూ ఉంటారు. ఫ్యాన్స్‌ మాత్రం వారి మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇద్దరూ కలిసి తరచూ రహస్యంగా షికారులకు వెళ్లడం, డిన్నర్‌ డేట్‌కు(Dinner Dates) వెళ్లడం, వెకేషన్‌లో ఎంజాయ్‌ చేయడం వంటివి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీరు షేర్‌ చేస్తే ఫోటోల ద్వారా ఇద్దరూ ఒకే ప్లేస్లో ఉన్నారని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు ఫ్యాన్స్‌.. వీరిమధ్య ఫ్రెండ్‌షిప్‌కు మించినది ఏదో ఉందని అనుమానపడుతున్నారు. లేటెస్ట్‌గా రష్మిక మరోసారి ఇలాంటి అనుమానాలకు ఊతం ఇచ్చింది. విమానాశ్రయంలో కనిపించిన ఈ బ్యూటీని చూసి చాలా మంది షాకయ్యారు. అందుకు కారణమేమింటే ఆమె విజయ్‌ దేవరకొండ షర్ట్‌తో కనిపించడం! కార్గో పాయింట్స్‌పై వైట్‌ క్రాప్‌ టాప్‌ ధరించిన రష్మిక దానిపై చెక్స్‌ షర్ట్‌ వేసుకుంది. లూజ్‌గా ఉన్న ఈ షర్ట్‌ విజయ్‌ దేవరకొండదేనని ఫ్యాన్స్‌ గట్టిగా నమ్ముతున్నారు. గతంలో విజయ్‌ ఈ చెక్స్‌ షర్ట్‌ వేసుకున్న ఫోటోను సాక్ష్యంగా చూపుతున్నారు. విజయ్‌ ఫోటోను, రష్మిక ఫోటోను పక్క పక్కన పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రేమపక్షులు పనిలో పడి ఒకరినొకరు బాగా మిస్‌ అఉతున్నట్టున్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప సీక్వెల్‌లోనూ రెయిన్‌బో అనే తెలుగు సినిమాలోనూ ప్రధాన భూమికలను పోషిస్తోంది. హిందీలో యానిమల్‌తో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తోంది. తమిళ హీరో ధనుష్‌- తెలుగు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో రష్మిక నటిస్తోంది..

Updated On 27 July 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story