ఆడవాళ్లు నెలసరిలో తీవ్ర ఇబ్బందులు పడతారు. ప్రతి మహిళకు నెలనెలా సుమారు 30 నుంచి 35 ఏళ్ల పాటు పీరియడ్స్‌(Periods) వస్తాయి. బయటకు చెప్పుకోలేరు కానీ అప్పుడు వారు ఎంతో బాధను అనుభవిస్తారు. ఆ నొప్పిని పంటికింద అదిమిపెట్టుకుని పనులు చేస్తుంటారు. ఒకప్పుడు రుతుచక్రం గురించి బయటకు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. నాప్కిన్స్ కొనడానికి కూడా మొహమాటపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఆడవాళ్లు నెలసరిలో తీవ్ర ఇబ్బందులు పడతారు. ప్రతి మహిళకు నెలనెలా సుమారు 30 నుంచి 35 ఏళ్ల పాటు పీరియడ్స్‌(Periods) వస్తాయి. బయటకు చెప్పుకోలేరు కానీ అప్పుడు వారు ఎంతో బాధను అనుభవిస్తారు. ఆ నొప్పిని పంటికింద అదిమిపెట్టుకుని పనులు చేస్తుంటారు. ఒకప్పుడు రుతుచక్రం గురించి బయటకు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. నాప్కిన్స్ కొనడానికి కూడా మొహమాటపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సహజ ప్రక్రియనే కాబట్టి ధైర్యంగా చెప్పుకుంటున్నారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika) ఈమధ్య తన పీరియడ్స్‌ బాధ గురించి సోషల్ మీడియాలో(Social media) షేర్‌ చేసుకున్నారు. పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పిని ఎలా తట్టుకోవాలి? ఏం చేస్తే ఆ నొప్పి నుంచి బయపడవచ్చు? అంటూ సోషల్ మీడియాలో ఓ పోల్‌ను పెట్టారు. ఇందులో ఆప్షన్లను కూడా ఇచ్చారు. 1. ఐస్‌ క్రీమ్‌, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా కొట్టాలా? 3, ఏదైనా సినిమా చూడాలా? 4. ఏడుస్తూ కూర్చోవాలా? అనే ప్రశ్నలను సంధిస్తూ ఏదో ఒక సమాధానం చెప్పమని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ తోచిన సలహాలు ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు. ధనుష్‌, శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న కుబేర సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్‌. ఇంకా రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఈ కన్నడ ముద్దుగుమ్మ కనిపించబోతున్నది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్‌లోనూ ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే హిందీతో రెడు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఒక్క రోజు కూడా తీరిక లేకుండా కష్టపడే రష్మిక మందన్నా పీరియడ్స్ సమయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతూనే షూటింగ్స్ కు అటెండ్‌ అవుతున్నట్టు ఆమె పెట్టిన పోస్టు చూస్తే అర్థమవుతోంది.

Updated On 11 March 2024 7:39 AM GMT
Ehatv

Ehatv

Next Story