రాశీ ఖన్నా(Rashi khanna).. ఒకప్పుడు వరుస సినిమాలతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసిన రాశీ ఖన్నాకు ఇప్పుడు తెలుగులో అవకాశాలులేవు కానీ ప్రేక్షకులు మాత్రం ఆమె సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రాశీఖన్నాపై సోషల్ మీడియాలో మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అదేమింటే రాశీఖన్నా లవ్‌లో పడిందని! ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పడంతో ఎవరా ప్రేమికుడు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టిన ఈ అందాలభామకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్‌గా తయారయ్యింది.
రాశీ ఖన్నా(Rashi khanna).. ఒకప్పుడు వరుస సినిమాలతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసిన రాశీ ఖన్నాకు ఇప్పుడు తెలుగులో అవకాశాలులేవు కానీ ప్రేక్షకులు మాత్రం ఆమె సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రాశీఖన్నాపై సోషల్ మీడియాలో మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అదేమింటే రాశీఖన్నా లవ్‌లో పడిందని! ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పడంతో ఎవరా ప్రేమికుడు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఊహలు గుసగుసలాడే(Uhalu gusagusalade) సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టిన ఈ అందాలభామకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్‌గా తయారయ్యింది. ఈమె సింగిల్‌గానే ఉందనుకుంటున్నారు చాలా మంది. కానీ తనకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. 'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్‌కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. తగ్గడానికి చాలా ప్రయత్నించాను. ఎన్నో వర్కౌట్స్ చేశాను. కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్‌ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది' అని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.
'హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయో మీరే చెప్పండి. అందుకే స్లిమ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. చివరికి నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలు పెట్టిన తర్వాత అదేమిటో కానీ బరువు తగ్గాను. ఇప్పుడు స్లిమ్‌గా తయారయ్యాను' అని రాశీఖన్నా అన్నారు. ఓ వ్యక్తి అని రాశీ ఖన్నా చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం చెప్పలేదు. మరికొద్ది రోజుల్లో ఆ వ్యక్తి ఎవరో చెబుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే రాశీ ఖన్నా నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు లాస్టియర్ విడుదలయ్యాయి. రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు సినిమాలు లేకపోయినా తమిళంలో రెండు, హిందీలో యోధ సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది ఫర్జీ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది.