సెలెబ్రిటీలకు డీప్ ఫేక్ (Deeep Fake)నిద్రపట్టకుండా చేస్తోంది. డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) చర్యలు చేపడుతున్నా సెలెబ్రిటీలు, సినీ తారలు దీని బారిన పడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra )కూడా ఇందులో ఇరుక్కున్నారు
సెలెబ్రిటీలకు డీప్ ఫేక్ (Deeep Fake)నిద్రపట్టకుండా చేస్తోంది. డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) చర్యలు చేపడుతున్నా సెలెబ్రిటీలు, సినీ తారలు దీని బారిన పడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra )కూడా ఇందులో ఇరుక్కున్నారు. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోను మార్చేసి జనాలను ఏమార్చే ప్రయత్నం చేశారు. అందులో ప్రియాంక చోప్రా ముఖం మార్చకుండా వాయిస్ మార్చారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టు లింప్‌సింక్ చేశారు. ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్టుగా వీడియోను రూపొందించారు. ఒక బ్రాండ్ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగిందని, అందరూ దానిని ఉపయోగించాలని ప్రియాంక చెబుతున్నట్టుగా వాయిస్‌ను మార్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇలా చేయడం దుర్మార్గమంటూ కామెంట్ చేస్తున్నారు. బాధ్యులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నామధ్య రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాజోల్, అలియా భట్, కత్రినా కైఫ్‌లు కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది ప్రముఖులు డిమాండ్ చేశారు. కేంద్ర ఐటీ శాఖ కూడా డీప్ ఫేక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చామని తెలిపింది.