పవర్ స్టార్ పవన్ (Pawan Kalyan) కల్యాణ్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు రాజకీయానికి సంబంధించిన సభలు, సమావేశాలు, మరోవైపు సినిమా షూటింగ్స్ అంటూ శ్రమిస్తున్నారు. కెరీర్‏లో ఆయన అసలు ఖాళీ లేకుండా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రాసెసింగ్‏లో ఉన్న రెండు సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), రెండోది ఓజీ (OG). ఈ రెండు ప్రాజెక్టులు హరీష్‏శంకర్ (Harish Shankar), సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఓజీ సినిమాకు సంబంధించిన ఓ అప్‏డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేస్తున్న ఓజీ చిత్రంలో హీరోయిన్ ప్రయాంక అరుల్ మోహన్ (Priyanka Mohan) నటిస్తుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఆ సినిమాకు మొదట హీరోయిన్‏గా మాళవిక మోహనన్ ‏(Malavika Mohanan)ను అనుకున్నారని.. ఆ తర్వాత ఆమె ప్లేస్‏లో ప్రియాంక అరుణ్ మోహన్‏ని రీప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ఆమె పవన్ కల్యాణ్‏తో షూటింగ్ కూడా చేసినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ భామ తెలుగులో ఇప్పటికే శ్రీకారం, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటిస్తుండటం శుభపరిణామంగానే చెప్పాలి.

ఇక ప్రియాంక అరుల్ మోహన్‏ను తీసుకుంటున్నట్టు ఓజీ (OG) చిత్ర నిర్మాతలు ఒక అఫిషియల్ అనౌన్స్‏మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారట. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల డీటెయిల్స్ మరికొన్ని రోజుల్లో తెలియనున్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి బ్రహ్మాండమైన సినిమాలు నిర్మించిన డీవీవీ (DVV) ఎంటర్ టైన్‏మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్యాన్ ఇండియా (PanIndia) మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) మొదటిసారి కలిసి పనిచేయబోతున్నారు. ఓజీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా ఆరు నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత ఈ ఏడాది చివరి కల్లా సినిమాను విడుదల చేయాలని మూవీ టీమ్ షెడ్యూల్ ప్లాన్ చేసిందట. ఇక హీరోయిన్ కన్ఫర్మేషన్‏పై ఎప్పుడు అఫిషియల్ అనౌన్స్‏మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఇటు పవన్ కల్యాణ్ అభిమానులు అండ్ అలాగే సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Updated On 12 April 2023 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story