☰
✕
హీరోయిన్ ప్రణీత(Pranathi) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
x
హీరోయిన్ ప్రణీత(Pranathi) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ప్రణీత భర్త నితిన్ రాజు ప్రకటించారు. బిడ్డను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో(Social media) ఫోటో కూడా షేర్ చేశారు. ప్రణీత-నితిన్ దంపతులకు ఇప్పటికే ఓ పాప ఉంది. 2022 జూన్‌లో వారికి పాప పుట్టింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత వారికి బాబు పుట్టాడు. మొదటిసారి తల్లి అయిన తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి వచ్చింది ప్రణీత. ఇప్పుడు ఆమెకు బాబు పుట్టాడు. ఆమె కెరీర్‌కు మళ్లీ గ్యాప్ రాబోతున్నది. 31 ఏళ్ల ప్రణీత దక్షిణభారతంలోని అన్ని భాషల్లో నటిస్తోంది. బాబుకు జన్మనివ్వడానికి కొన్ని నెలల ముందు ఆమె ఓ కన్నడ, ఓ మలయాళ సినిమాలో నటించింది. ఇప్పుడు కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది ప్రణీత!
Eha Tv
Next Story