పవన్‌కల్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది(Atharintiki Dharedhi) సినిమాలో సమంతతో(samantha) పాటు రెండో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ప్రణీత(Pranathi) గుర్తున్నారు కదా! ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన ప్రణీత తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు.
పవన్‌కల్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది(Atharintiki Dharedhi) సినిమాలో సమంతతో(samantha) పాటు రెండో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ప్రణీత(Pranathi) గుర్తున్నారు కదా! ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన ప్రణీత తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఇటీవల తన భర్తకు(Husband) పాదపూజ(Padapooja) చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే లాస్టియర్ ఇలంటి ఫోటోలనే పోస్ట్ చేసినప్పుడు ఆమెపై బోల్డన్ని విమర్శలు వచ్చాయి. నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. ఈసారి అలాంటి విమర్శలు రాకుండా ముందు జాగ్రత్త పడ్డారు. ఫోటోలు పోస్ట్ చేస్తున్నప్పుడే అందరికీ గట్టి సమాధానం ఇచ్చారు ప్రణీత. 'భీమన అమవాస్య సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా నా భర్తకు పాదపూజ చేశాను. గత ఏడడాది ఈ విషయంలో నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా విమర్శించిన వారికి ఇది పితృస్వామ్యంలో భాగంగా కనిపిస్తుందేమో.. నాకు మాత్రం ఈ పూజ సంప్రదాయంలో ఓ భాగంలా కనిపిస్తుంది. దీనికి ఎంతో ప్రాముఖ్యత వుంది’ అంటూ పోస్ట్ చేశారు ప్రణీత.
Offering puja on the occasion of #BheemanaAmavasya this morning.
To you, it may be a show of patriarchy (from what I saw last year, with meme pages etc debating this), but to me , it holds great significance.
In #SanatanaDharma, most rituals have a story to back why it is… pic.twitter.com/uZCsL4oID0— Pranitha Subhash (@pranitasubhash) July 17, 2023