సినిమాలలో హోమ్లీ నటి అనిపించకుంది ప్రగతి(Pragati). కాని బయట మాత్రం ఆమె చేసే పనులుషాకింగ్ గా ఉంటాయి. స్టైలీష్ లుక్స్ తో.. స్లీవ్ లెస్ డ్రస్సులతో సందడి చేస్తుంటుంది. రకరకాల వీడియోలతో . సోషల్ మీడియాలో(Social media) ప్రగతి చేసే సందడి అంతా ఇంతా కాదు. నెట్టింట ఆమె వీడియోలకు భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే నెట్టింట్లో వర్కౌట్ వీడియోలతో సందడి చేస్తుంటుంది సీనియర్ బ్యూటీ.

సినిమాలలో హోమ్లీ నటి అనిపించకుంది ప్రగతి(Pragati). కాని బయట మాత్రం ఆమె చేసే పనులుషాకింగ్ గా ఉంటాయి. స్టైలీష్ లుక్స్ తో.. స్లీవ్ లెస్ డ్రస్సులతో సందడి చేస్తుంటుంది. రకరకాల వీడియోలతో . సోషల్ మీడియాలో(Social media) ప్రగతి చేసే సందడి అంతా ఇంతా కాదు. నెట్టింట ఆమె వీడియోలకు భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే నెట్టింట్లో వర్కౌట్ వీడియోలతో సందడి చేస్తుంటుంది సీనియర్ బ్యూటీ. ఏదో సరదాకి.. ఇలా చేస్తుంది అనుకున్నారు అంతా. లేదా ఫిట్ నెస్ కోస ఇలా చేస్తుంది అనుకున్నారు కాని.. ఆమె చాలా సీరియస్ గా తీసుకుని.. ఛాంపియన్ షిప్ వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం నటి ప్రగతీ పవర్ లిప్టింగ్(Weight Lifting) లో ఛాంపియన్ షిప్ సాధించింది.

ప్రగతీ ఆంటీ వర్కౌట్స్(Workouts) చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే పలువురు ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ విమర్శలు చేశారు. కానీ ప్రగతి అవేమి పట్టించుకోకుండా బాడీ బిల్డ్ చేసే పనిలో పడింది. అయితే ఇంత కష్టం ఎందుకో ఇప్పుడు అందరికి తెలిపింది. ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్(south India Power lifting) సీనియర్, జూనియర్ కాంపిటీషన్స్ 2024లో ప్రగతి పాల్గొంది. ఈ పోటీల్లో ఏకంగా సిల్వర్ మెడల్(Silver medal) సాధించి సెకండ్ ప్లేస్ సాధించింది ప్రగతి. అంతే కాదు తనను విమర్షించేవారికి ముఖం మీద కొట్టినంత పనిచేసింది.

ఇక ప్రగతి పపర్ లిప్టింగ్ తో పాటు.. మెడల్ సాధించిన వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రగతి వయసు 47 ఏళ్ళ. 50కి మూడేళ్ల దూరంలో ఉన్న ఈమె ఇంత కష్టపడి పవర్ లిఫ్టింగ్ లో ఏకంగా సౌత్ ఇండియన్ చాంప్ అవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు మనస్పూర్తిగా ప్రగతికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఇక్కడితో ఆగడంలేదు ప్రగతి...త్వరలో నేషనల్ ఛాంపియన్ షిప్ లో కూడా ప్రగతి పాల్గొంటుందని సమాచారం. ఓ పక్క యాక్టింగ్ చేస్తూ మరో పక్క తన బాడీ బిల్డ్ మీద ఫోకస్ చేసి ఎంతో మందిమహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది నటి.

Updated On 22 Jan 2024 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story