సోషల్ మీడియాలో(Social Media) యమ యాక్టివ్‌గా ఉండే ప్రగతి(Pragathi) వ్యక్తిగత జీవితం గురించి రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రగతి రెండో పెళ్లి(Second Marriage) చేసుకోబోతున్నారని, ఆమె పెళ్లి చేసుకోబోయే వక్తి ప్రముఖ నిర్మాత అని కొన్ని వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. దీనిపై ప్రగతి స్పందించారు.
సోషల్ మీడియాలో(Social Media) యమ యాక్టివ్‌గా ఉండే ప్రగతి(Pragathi) వ్యక్తిగత జీవితం గురించి రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రగతి రెండో పెళ్లి(Second Marriage) చేసుకోబోతున్నారని, ఆమె పెళ్లి చేసుకోబోయే వక్తి ప్రముఖ నిర్మాత అని కొన్ని వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. దీనిపై ప్రగతి స్పందించారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్న మీడియాపై(Media) మండిపడ్డారు. 'నేను పెళ్లి చేసుకుంటున్నట్లు వెబ్‌సైట్లే కాదు, ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి. అవి చూడగానే ఎంతో బాధగా అనిపించింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం.
నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని మరొకరి వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్టు రాస్తారు? నేను ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా. ఇక ముందైనా ఇలాంటివి రాసేముందు చెక్ చేసుకుని, నిజానిజాలు తెలుసుకొని రాయండి. ఒకరి గురించి రాసేటప్పుడు హద్దులు మీరకూడదు. అసలు అలాంటిది ఏదైనా ఉంటే నేను చెబుతాను కదా! అంతేగానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా ఆత్మగౌరవాన్ని ఇలా దెబ్బతీయడం సరైన పద్ధతి కాదు’ అంటూ ప్రగతి ఆగ్రహంతో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పటి హీరోయిన్ అయిన ప్రగతి కొన్నాళ్లుగా క్యారెక్టర్ రోల్స్ వేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో అమ్మ, వదిన పాత్రలు వేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో వంద సినిమాలకు పైగా నటించారు. చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళాశంకర్‌లో కూడా ప్రగతి నటించారు.