పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ మధ్య ఎప్పుడూ విభేదాలు వస్తూనే ఉంటాయి.. తాజాగా పూనమ్ చేసిన ట్వీట్‌తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది ఈ పంజాబీ ముద్దు గుమ్మ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి సంబంధించి మూవీ టీమ్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో పవన్ కాళ్ళ దగ్గర సినిమా పేరును పెట్టారు మేకర్స్..

Poonam Kaur on Pawan Kalyan
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పుడూ విభేదాలు వస్తూనే ఉంటాయి.. తాజాగా పూనమ్ చేసిన ట్వీట్‌తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది ఈ పంజాబీ ముద్దు గుమ్మ.. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh). ఈ సినిమాకి సంబంధించి మూవీ టీమ్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో పవన్ కాళ్ళ దగ్గర సినిమా పేరును పెట్టారు మేకర్స్.. స్వాతంత్త్రం కోసం ప్రాణాలు అర్పించిన ఒక అమర యోధుడి పేరును ఆలా కాళ్ళ దగ్గర పెట్టడం ఏంటి అంటి పూనమ్ ఫైర్ అయింది. "ఇది అహంకారామా.. లేక నిర్లక్ష్యం. ఒక కొత్త సినిమా పోస్టర్లో స్వాతంత్ర సమరయోధుడి పేరును కాళ్లదగ్గర పెట్టి అవమానించారు ఆమె ట్వీట్లో పేర్కొంది.
పూనమ్ ట్వీట్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే పూనమ్ ఇలాంటి పిచ్చి ట్వీట్స్ చేస్తుందని, పవన్ అంటే గిట్టని కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ ఆమెను ట్రోల్ల్స్ చేస్తున్నారు. మరి ఈ గొడవపై మూవీ టీమ్ వివరణ ఇస్తుంది లేదో చూడాలి మరి.
