సినీ నటి పూనమ్‌కౌర్(Poonam kaur) మరోసారి దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై(Trivikram srinivas) మండిపడ్డారు.
సినీ నటి పూనమ్‌కౌర్(Poonam kaur) మరోసారి దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై(Trivikram srinivas) మండిపడ్డారు.అలా మండిపడటానికి కారణం రాజకీయ విశ్లేషకుడు , ఒకప్పటి నిర్మాత, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు(Tripuraneni chitti babu) చేసిన కామెంట్లే! ఆయన ఏమన్నారంటే పూనమ్ కౌర్ ఆరపణలు చేయడమే తప్ప ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదని, ఆఫీసుకు ఎన్నిసార్లు పిలిచినా రాలేదని చెప్పారు. అక్కడితో ఆగారా? ట్విట్టర్‌లో(twitter) ఎప్పుడో ఓసారి పిచ్చిగా ట్వీట్లు వేస్తుందని, ఫిర్యాదు మాత్రం చేయదని, అసలేం జరిగిందో చెప్పడం లేదని చెప్పుకొచ్చారు. చిట్టిబాబు మాటలపై పూనమ్ కౌర్ మండిపడ్డారు. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా అని ప్రశ్నించారు. తాను ఆల్రేడి కంప్లైట్ చేశానని, ఎవరూ యాక్షన్ తీసుకోలేదని వివరణ ఇచ్చుకున్నారు. చిట్టిబాబు ఎప్పుడూ అబద్ధాలే ఆడతారని తిట్టిపోశారు. అమ్మాయిలదే తప్పు అన్నట్టుగా చెప్పడం దారుణం అని పూనమ్ అన్నారు. 'మీరు త్రివిక్రమ్‌ను ప్రశ్నించరు, ప్రశ్నించే దమ్ము మీకు లేదు. నేను మీలా ఫేక్ కాదు. మీలా వెన్నుముక లేని దానికి కాదు. ఈ చిట్టిబాబుకు నన్ను ప్రశ్నించడం, నా మీద కామెంట్ చేయడం కాకుండా త్రివిక్రమ్‌ను అడిగే దమ్ముందా?' అని నిలదీశారు.