✕
Pooja Hegde : కొత్త ఔట్ ఫిట్‌లో మెరిపిస్తోన్న జిగేల్ రాణి.. !
By EhatvPublished on 28 April 2023 1:10 AM GMT
తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde) విడుదల చేసేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెరిసే గౌనుతో ఆమె అందాలను ఆరబోసింది. ఈ ఫొటోలకు అభిమానులతోపాటు నెటిజన్లు పూజా ఈజ్ హాట్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.

x
Pooja Hegde
-
- డైరెక్టర్ త్రివిక్రమ్‌కి సెంటిమెంట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆ భామ పూజా హెగ్డేనే (Pooja Hegde). ఈ డస్కీ బ్యూటీతో మాటల మాంత్రికుడు వరుస హిట్స్‌ను సొంతం చేసుకున్నాడు. అందుకేమో ఆయన ప్రతీ చిత్రంలో ఈ భామనే పిక్ చేసుకుంటారాయన. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఈ భామతో మూడో సినిమా చేస్తున్నారు. ఈ భామ ఇటు తెలుగులో తన హవా చూపిస్తూనే.. అటు బాలీవుడ్‌లోనూ చక్రం తిప్పుతోంది.
-
- పూజా హెగ్డే (Pooja Hegde) తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హేగ్డేలది కర్నాటకలోని మంగళూరు కానీ పూజా ముంబైలోనే పుట్టి పెరిగింది. ఈ భామ తన మాతృభాష తుళుతోపాటు, కన్నడ, ఇంగ్లిషు, హిందీ భాషలు మాట్లాడుతుంది. ఆమె కాలేజ్ డేస్‌లో తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేదట. దాంతో నెట్వర్కింగ్ లో పూజా ఎక్స్పర్ట్ అయింది. ఆ సమయంలో ఆమె కాలేజీల్లో నిర్వహించే ఫ్యాషన్ పోటీలు, డ్యాన్స్ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తుండేదట.
-
- 1990 అక్టోబర్ 13న పుట్టిన ఈ బ్యూటీ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2010లో నిర్వహించిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా నుంచి ఆమె సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత 2012లో ముగమూడి (Mugamoodi) అనే తమిళ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. ఆ మూవీనే తెలుగులో మాస్క్ పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్.బిచౌదరి సమర్పణలో సూపరర్ గుడ్ బ్యానర్‌పై నిర్మించారు.
-
- ఆ తర్వాత 2014లో ముకుంద (Mukunda) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ చిత్రం ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. అదే ఇయర్లో ఆమె అక్కినేని నాగ చైతన్య సరసన నటించింది. రెండో చిత్రమైన ఒక లైలా కోసం (Oka Laila Kosam) చిత్రం కూడా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఆ రెండు సినిమాలు టాలీవుడ్లో పెద్దగా ఆడకపోవడంతో ఆ తర్వాత ఛాయిస్ బాలీవుడ్‌కి తీసుకుంది.
-
- 2016లో అశుతోష్ గోవారికర్ డైరెక్షన్ వచ్చిన మొహంజోదారో (Mohenjo Daro) చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటించి కాస్త పేరు సంపాదించుకుంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం (DJ:Duvvada Jagannadham) చిత్రంలో అల్లు అర్జున్‌తో జత కట్టింది. ఆ చిత్రం కూడా బాక్సీసు దగ్గర అనుకుంత కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
-
- దీంతో ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం (Rangasthalam) చిత్రంలో 'జిగేలు రానీ' అంటూ వచ్చిన మాస్ ఆడియన్స్‌తోపాటు క్లాస్ ఆడియన్స్‌నూ కొత్త జోరును పెంచింది పూజా హెగ్డే, ఆ తర్వాత సాక్ష్యం చిత్రం తర్వాత టాలీవుడ్లో తనకు అచ్చిరావడం లేదనుకుంటున్న టైమ్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వచ్చింది.
-
- అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava) చిత్రంలో అరవింద క్యారెక్టర్‌తో ఆడియన్స్ కాస్త దగ్గరైన పూజా, అదే ఇయర్లో మహర్షి (Maharshi), గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) వంటి చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో ఓ ప్లేస్ సంపాదించింది పూజా హెగ్డే. ఆ తర్వాత బాలీవుడ్లో హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటించింది.. ఇటు బాలీవుడ్ , టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తున్న టైమ్‌లో అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్‌ను కొట్టేసింది ఈ అమూల్య.
-
- ఆ తర్వాత ఆమె కెరీర్ చెపుకోదగ్గర సినిమాలేవి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలన్నీ బాక్సీఫీసు దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఆ తర్వాత ఎఫ్ 3 చిత్రంలో మళ్లీ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది పూజా. ఇక టాలీవుడ్లో వర్కౌట్ అవ్వడం లేదనుకుందో ఏమోగాని, మెల్లగా బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది ఈ భామ.
-
- అటు బాలీవుడ్ లో సర్కస్, కిసికా భాయ్ కిసి కీ జాన్ చిత్రాల్లో నటించింది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం కూడా పెద్దగా ఆడినట్టు ఎక్కడా కపినించలేదు. దీంతో మళ్లీ ఆమెకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ చెంతకు చేరింది ఈ బ్యూటీ. ఆ చిత్రంలో ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో ఈ బ్యూటీ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటు ఫ్యాషన్ షోలు, ఈవెంట్లతో బిజీగా ఉంటూ.. తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోల సోషల్ మీడియాలో వదులుతుంటుంది.
-
- తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde) విడుదల చేసేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెరిసే గౌనుతో ఆమె అందాలను ఆరబోసింది. ఈ ఫొటోలకు అభిమానులతోపాటు నెటిజన్లు పూజా ఈజ్ హాట్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఈ భామకు సరైన బ్లాక్ బస్టర్స్ లేకపోయినా గ్లామర్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో 23.4 మిలియన్ల ఫాలోవర్లను తన వెంట తిప్పుకుంటుంది ఈ డస్కీ బ్యూటీ.

Ehatv
Next Story