బాలీవుడ్ స్టార్ హీరో(Bollywood Star Hero) సల్మాన్‌ఖాన్(Salman Khan)పై నటి పాలక్ తివారి(Actress Palak Tiwari) చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సల్మాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమా(Kisi Ka Bhai Kisi Ki Jaan Movie) రంజాన్ కానుక(Ramadan gift)గా విడుదల కానుంది. 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్.

Palak Tiwari Comment On Salman Khan
బాలీవుడ్ స్టార్ హీరో(Bollywood Star Hero) సల్మాన్‌ఖాన్(Salman Khan)పై నటి పాలక్ తివారి(Actress Palak Tiwari) చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సల్మాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమా(Kisi Ka Bhai Kisi Ki Jaan Movie) రంజాన్ కానుక(Ramadan gift)గా విడుదల కానుంది. 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. ఇక ఈ సినిమాలో నటించిన పాలక్ తివారీ ఓ ఇంటర్వ్యూలో హీరో సల్మాన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. సల్మాన్‌తో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన సెట్‌లో అమ్మాయిలు పద్దతిగా దుస్తులు వేసుకోవాలన్న రూల్ పెడతారు అని చెప్పారు. డీప్ నెక్ ఉన్న డ్రెస్సులు అసలు వేసుకోనివ్వరు. 'సల్మాన్ ఖాన్ ఇలాంటి రూల్ పెట్టడానికి కారణం ఉంది. ఆయన సంప్రదాయాలకు బాగా విలువిస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. ఇక సల్మాన్ సినిమా షూటింగ్ అనగానే నా తల్లి సంతోషడ్డారు. ఎందుకంటే మా అమ్మకు నా డ్రెస్సింగ్ విషయంలో కొన్ని ఫిర్యాదులు ఉండేవి' అని పాలక్ తివారీ అన్నారు. సల్మాన్ పెట్టిన రూల్స్ కారణంగా తాను నిండుగా కప్పుకుని షూటింగ్ వెళ్లేదానినని, అది చూసి అమ్మ మురిసిపోయేదని చెప్పారు. కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాలో పాలక్ తివారీ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్‌గా పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తున్నారు.
