టాలీవుడ్‌(Tollywood) నటి నివేదాపేతురాజ్‌(Nivetha Pethuraj) వార్తల్లోకి ఎక్కింది. లేటెస్ట్‌గా పోలీసులతో(Police) గొడవ పెట్టుకుంది. పోలీసులతో ఆమె గొడవపడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ ఉంది కాబట్టి మీ కారును(Car) చెక్‌ చేయాలని అనుకుంటున్నాం.

టాలీవుడ్‌(Tollywood) నటి నివేదాపేతురాజ్‌(Nivetha Pethuraj) వార్తల్లోకి ఎక్కింది. లేటెస్ట్‌గా పోలీసులతో(Police) గొడవ పెట్టుకుంది. పోలీసులతో ఆమె గొడవపడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే కారులో వెళుతున్న నివేదా పేతురాజ్‌ను పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ ఉంది కాబట్టి మీ కారును(Car) చెక్‌ చేయాలని అనుకుంటున్నాం. ఓసారి డిక్కీని(Trunk) ఓపెన్‌ చేయండి అని చాలా పద్దతిగా అడిగారు. దానికి నివేదా పేతురాజ్‌ అంగీకరించలేదు. కొంచెం అర్జెంట్‌ పని ఉందని, ఇప్పుడు డిక్కీ ఓపెన్‌ చేయలేనని చెప్పింది. తన దగ్గర పేపర్స్‌ అన్ని ఉన్నాయని, కావలిస్తే చెక్‌ చేసుకోండని తెలిపింది. పోలీసులు నివేదా మాటలను పట్టించుకోలేదు. డిక్కీ ఓపెన్‌ చేయమని మరోసారి రిక్వెస్ట్ చేశారు. దీనికి నివేదా కాస్త కోపంగానే సమాధానం ఇచ్చింది. 'ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. వీడియో తీయడం ఆపండి అంటూ కోపగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇది నిజం కాదని లైట్‌ తీసుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన స్క్రిప్ట్ వీడియో అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated On 30 May 2024 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story